భీష్మ రివ్యూ ఇచ్చిన త్రివిక్రమ్


భీష్మ రివ్యూ ఇచ్చిన త్రివిక్రమ్
భీష్మ రివ్యూ ఇచ్చిన త్రివిక్రమ్

నితిన్ నటించిన భీష్మ చిత్రం ఈ వారం విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా సాగతున్నాయి. నితిన్, రష్మిక అండ్ కో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే నిన్న థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే హిట్ కళ స్పష్టంగా కనిపిస్తోంది. వెంకీ కుడుముల ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులు కలిపి ఈ సినిమాను తీసినట్టుగా తెలుస్తోంది. ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడంతో సినిమాకు హిట్ కళ వచ్చేసింది.

ఇక నిన్న రాత్రే చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఈ ఈవెంట్ కు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిధిగా విచ్చేసి సినిమాకు శుభాకాంక్షలు తెలిపాడు. నితిన్ తో కలిసి అ.. ఆ సినిమాకు త్రివిక్రమ్ పనిచేసిన సంగతి తెల్సిందే. అదే సినిమాకు ప్రస్తుత భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల త్రివిక్రమ్ కు అసిస్టెంట్ గా పనిచేయడం విశేషం.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం గురించి మాట్లాడుతూ మొదటి రివ్యూ ఇచ్చేసాడు. తాను ఈ చిత్రం చూసినట్లు కచ్చితంగా సూపర్ హిట్ అవుతున్నట్లు చెప్పేసాడు. ఇది అందరూ చెప్పే మాటే. అయితే సినిమాలో విశేషాలను కూడా చెప్పడం విశేషం.

భీష్మలో ఒక ఫైట్ ను అద్భుతంగా చిత్రీకరించారని, వెంకీ ఈ చిత్రాన్ని చాలా బాగా తీర్చిదిద్దాడని. మహతి సంగీతం కానీ, శేఖర్, జానీ మాస్టర్ ల కొరియోగ్రఫీ కానీ సూపర్ గా ఉన్నట్లు ప్రకటించాడు. అలాగే రష్మిక మందన్న ఇటీవలే సరిలేరు ద్వారా సక్సెస్ అందుకుంది. ఆమెకు మరో సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. నితిన్ కు తన అన్నయ్య పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ తరుపున ఆయన అభిమానుల తరుపున నితిన్ కు ఈ చిత్ర విజయానికి శుభాకాంక్షలు అని తెలిపాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి అగ్ర దర్శకుడు ఈ చిత్రం పట్ల ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడంతో భీష్మపై అంచనాలు ఇప్పుడు మరింత పెరిగాయి.