పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ.. త్రివిక్రమ్ స్పందనేంటి?


పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ.. త్రివిక్రమ్ స్పందనేంటి?
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ.. త్రివిక్రమ్ స్పందనేంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడూ రిజర్స్వ్డ్ గా ఉండే పవన్ సినిమా వ్యక్తులతో ఎక్కువగా తిరగడం అదీ ఉండేది కాదు. సినిమాలు చేసుకోవడం, తన ఫామ్ హౌస్ చూసుకోవడం అన్నట్టుండేది పరిస్థితి. తన సినిమాలను కూడా తాను చూసుకోడు. అంతటి ఇంట్రావర్ట్ అయిన పవన్ కు ఇండస్ట్రీలో బాగా కావాల్సిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. జల్సాతోనే మొదటి వీరిద్దరి ప్రయాణం మొదలైనా అత్తారింటికి దారేది సినిమాతో బాగా కనెక్ట్ అయిపోయారు. ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లడం అప్పట్లో బాగా జరిగింది.

అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం వెనకాల త్రివిక్రమ్ ప్రోద్బలం ఉందనేది ఇండస్ట్రీలో అనుకునే మాట. అంతే కాకుండా జనసేనలో పవన్ కళ్యాణ్ స్పీచ్ లు చాలా వరకూ త్రివిక్రమ్ రాస్తున్నాడని కూడా అప్పట్లో రూమర్ బలంగా నడిచేది. పవన్ గురించి మాట్లాడితే త్రివిక్రమ్ ప్రస్తావన రావాల్సిందే. అంతలా ఇద్దరూ క్లోజ్ గా ఉండేవారు. అయితే ఈ మధ్య ఇలాంటి వార్తలు కొంచెం తగ్గాయి.

ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను ఈ చిత్రం తిరగరాస్తోంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ నిన్న మీడియాతో సక్సెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీ సినిమా చూసారా అన్న ప్రశ్నకు త్రివిక్రమ్ మాట్లాడుతూ సాధారణంగా ఆయన సినిమాలే 100 రోజులకు గానీ చూడరు. అత్తారింటికి దారేది కూడా బలవంతం పెడితే 120 రోజులకు చూసారు. పైగా ఇప్పుడు ఆయన సినిమాల్లోకి కూడా వచ్చారు. సినిమాల్లో నటిస్తున్నా ఆయనకు మొదటి ప్రిఫెరెన్స్ రాజకీయాలే అని స్పందించారు. అయితే ఈ సినిమా నెల రోజుల లోపే చూస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.

ఇక అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ సినిమా చూసి మొదటగా మెగాస్టార్ చిరంజీవి ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఆనాడే ఊహించారని తెలిపాడు.