యంగ్ హీరోతో త్రివిక్రమ్ సినిమా?


యంగ్ హీరోతో త్రివిక్రమ్ సినిమా?
యంగ్ హీరోతో త్రివిక్రమ్ సినిమా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి తన స్టామినాను అల వైకుంఠపురములో చిత్రం ద్వారా రుజువుచేసాడు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత అరవింద సమేతతో హిట్ కొట్టినా కానీ ఇంకా తన స్టామినాపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటన్నిటినీ ఒక్కసారిగా పటాపంచలు చేసేసాడు త్రివిక్రమ్ అల వైకుంఠపురములో చిత్రంతో. ఈ సినిమా అటు అల్లు అర్జున్, ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్స్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమాను ఎన్టీఆర్ తో ఫిక్స్ చేసుకున్న విషయం తెల్సిందే. అసలైతే ఈ సినిమా సమ్మర్ లో మొదలవుతుందని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడడంతో వచ్చే ఏడాదికి కానీ ఎన్టీఆర్, చరణ్ ఫ్రీ అయ్యే పరిస్థితి లేదు. మరి ఈ నేపథ్యంలో అప్పటిదాకా త్రివిక్రమ్ వంటి అగ్ర దర్శకుడు ఖాళీగా ఉండిపోతే ఎలా? అలా అని ఇప్పటికిప్పుడు భారీ సినిమాను మొదలుపెట్టలేడు. ఎందుకంటే స్టార్ హీరోలందరూ తమ తమ సినిమాల బిజీతో ఉన్నారు. అందులోనూ స్టార్ హీరోతో సినిమా అంటే ప్రీ ప్రొడక్షన్ తో కలుపుకుని మినిమం ఆరు నెలల శ్రమ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో త్రివిక్రమ్ ఒక మీడియం బడ్జెట్ సినిమాను యంగ్ హీరోతో చేయాలని అనుకుంటున్నాడట.

త్రివిక్రమ్ సినిమాలు ఎప్పుడూ బడా హీరోలతోనే ఉంటాయి. అయితే మధ్యలో అ.. ఆ అంటూ నితిన్ తో సినిమా చేసి హిట్ కొట్టాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మీడియం బడ్జెట్ లో ఆ సినిమా చేయగా, అది భలేగా వర్కౌట్ అయింది. సో మరోసారి అలాంటి ప్రయత్నమే త్రివిక్రమ్ చేస్తాడని అంటున్నారు.

ఇది వరకే నాగ చైతన్యతో ఈ మాటల మాంత్రికుడు సినిమా చేయాల్సి ఉంది. అయితే అనుకోని కారణాలతో అది అప్పుడు కుదర్లేదు. మరి ఇప్పుడు చైతూతోనే త్రివిక్రమ్ ముందుకెళతాడా లేదా ఎన్టీఆర్ వచ్చేవరకూ ఆగుతాడా? లేదంటే మరో భారీ సినిమానే ఎంచుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది. మరింత క్లారిటీ మరో రెండు నెలల్లో వచ్చే అవకాశముంది.