పవన్ కు త్రివిక్రమ్ కథ చెబుతాడట


పవన్ కు త్రివిక్రమ్ కథ చెబుతాడట
పవన్ కు త్రివిక్రమ్ కథ చెబుతాడట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఎన్నడూ లేనిది సమాంతరంగా సినిమాలు చేస్తూ వరసగా సినిమాలకు సంతకాలు చేసేస్తున్నాడు. ఇప్పటికే పింక్ రీమేక్, క్రిష్ తో సినిమాల షూటింగ్స్ ను మొదలుపెట్టేశాడు పవన్, ఇందులో ఒకటి పూర్తవ్వగానే హరీష్ శంకర్ తో సినిమాను పట్టాలెక్కిస్తాడట. సమ్మర్ నుండే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ ఇలా త్వరగా సినిమాలు చేస్తుండడంతో మిగిలిన దర్శకులు కూడా పవన్ తో సినిమా చేసే ఛాన్స్ వస్తుందేమోనని ఆయనకు తగ్గ కథలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఇప్పుడు పలువురు దర్శకులు ఈ పనిపై ఉండగా లేటెస్ట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా లిస్ట్ లో యాడ్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే అల వైకుంఠపురములో చిత్రంతో అతి పెద్ద విజయాన్ని అందుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిజానికైతే ఎన్టీఆర్ తో తన తదుపరి చిత్రం ఉండాలి కానీ ఇప్పుడప్పుడే ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఏప్రిల్ నుండి షూటింగ్ చేద్దామనుకున్నా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ వచ్చే జనవరికి వాయిదా పడడంతో ఎన్టీఆర్ ఈ ఏడాదంతా బిజీగా ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ మనసు మార్చుకుని ఈలోగా ఒక సినిమాను మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి ఇప్పటివరకూ మూడు సినిమాలు చేసారు. అందులో ఒకటి సూపర్ హిట్, ఇంకోటి ఇండస్ట్రీ హిట్, మూడోది మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు త్రివిక్రమ్ తలుచుకుంటే పవన్ కళ్యాణ్ డేట్స్ వెంటనే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి త్రివిక్రమ్ నిజంగానే ఈ దిశగా ఆలోచిస్తున్నాడా? వీరిద్దరూ కలిసి నాలుగోసారి పనిచేసి అజ్ఞాతవాసి జ్ఞాపకాలను తుడిచిపెట్టేస్తారా అన్నది తెలియాలంటే మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ యంగ్ హీరోతో కూడా సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ రెండిట్లో ఏది నిజమో? లేక ఎన్టీఆర్ వచ్చే వరకూ ఎదురుచూస్తూ ఉంటాడా?