నిజమే.. వకీల్ సాబ్ ను త్రివిక్రమ్ చేయాల్సిందట


నిజమే.. వకీల్ సాబ్ ను త్రివిక్రమ్ చేయాల్సిందట
నిజమే.. వకీల్ సాబ్ ను త్రివిక్రమ్ చేయాల్సిందట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత దగ్గర సన్నిహితులో అందరికీ తెలుసు. జల్సాతో వీరి ప్రయాణం మొదలైంది. అయితే కొద్దీ కాలంలోనే ఇద్దరి అభిరుచులు కలవడంతో వ్యక్తిగత స్నేహం ప్రారంభమైంది. పవన్ వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాల్లో త్రివిక్రమ్ పాత్ర గత కొంత కాలంనుండి ఉంటోంది. పవన్ కళ్యాణ్ అడిగాడని తీన్ మార్ చిత్రానికి మాటలు రాసాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ కోసం పింక్ సినిమాను సూచించింది కూడా త్రివిక్రమ్ అని ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుండి ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు అదే విషయం నిజమైంది. అసలు పింక్ చిత్రం వకీల్ సాబ్ కు త్రివిక్రమ్ పనిచేయాల్సిందట. ఈ విషయాన్ని చెప్పింది మరెవరో కాదు ఆ చిత్ర దర్శకుడు వేణుశ్రీరాం.

ఇటీవలే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాల్ని బయటపెట్టాడు. నేను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని. అయితే నేనే పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేస్తానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. నేను వేరే సినిమా సన్నాహకాల్లో ఉండగా దిల్ రాజుతో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కలిసాను. అప్పుడు వారి మాటల్లో పింక్ సినిమా ప్రస్తావన వచ్చింది. ఎవరు డైరెక్ట్ చేస్తారో అనుకున్నాను కానీ ఆ అవకాశం నాకే వస్తుందని ఊహించలేదు.

నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ వకీల్ సాబ్ కు మాటలు రాద్దామనుకున్నారు కానీ అల వైకుంఠపురములో సినిమా పనుల్లో బిజీగా ఉండి కుదర్లేదు అని చెప్పుకొచ్చాడు వేణుశ్రీరాం.