పవన్ విషయంలో తెరవెనుక త్రివిక్రమ్


పవన్ విషయంలో తెరవెనుక త్రివిక్రమ్
పవన్ విషయంలో తెరవెనుక త్రివిక్రమ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత క్లోజ్ అనేది అందరికీ తెలిసిందే. ఇద్దరి భావాలు కలవడంతో ఇద్దరూ కలిసి ఎక్కువగా ట్రావెల్ చేసారు. ఒకానొక సమయంలో పవన్ ఎక్కడికెళ్లినా పక్కన త్రివిక్రమ్ ఉండాల్సిందే. జనసేన మొదటి స్పీచ్  కూడా త్రివిక్రమ్ రాసాడని చాలా మంది అంటుంటారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని వాడుకోవాలనుకుంటున్నారు కొంత మంది.

చాలా రోజులుగా పవన్ ను సినిమాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే. వారికి ఇప్పుడు పింక్ రీమేక్ తమిళ్ లో హిట్ అవ్వడం కూడా కొత్త ఆశలు చిగురింపజేసింది. ఆ సినిమా అయితే పవన్ కేవలం నటిస్తే చాలు. తక్కువ రోజుల్లో కూడా షూటింగ్ పూర్తి చేసేయొచ్చు.

కానీ పవన్ ఏ విషయం చెప్పట్లేదు. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను రంగంలోకి దించారు. తనైతే పవన్ ను కచ్చితంగా ఒప్పిస్తాడని పింక్ సినిమాను కొన్న దిల్ రాజు అండ్ కో భావిస్తున్నారు. రీసెంట్ గా త్రివిక్రమ్, పవన్ ను కలిసినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. చూడాలి మరి త్రివిక్రమ్ అయినా పవన్ ను ఇటువైపు లాగగలడేమో.