మెగాస్టార్-మాటల మాంత్రికుడి కాంబో వర్కౌట్ అవుతుందా?


మెగాస్టార్-మాటల మాంత్రికుడి కాంబో వర్కౌట్ అవుతుందా?
మెగాస్టార్-మాటల మాంత్రికుడి కాంబో వర్కౌట్ అవుతుందా?

మెగా స్టార్ చిరంజీవి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ గురించి గత కోనేళ్ళుగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఎందుకనో ప్రాజెక్ట్ సెట్ అవ్వట్లేదు. అయితే అది ఇప్పుడు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్నాడు. దాని తర్వాత లూసిఫెర్ రీమేక్ చేయాల్సి ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ తో అయినను పోయి రావాలె హస్తినకు చేయాల్సి ఉంది. వీరిద్దరి కమిట్మెంట్లు పూర్తైన తర్వాత చిరంజీవితో త్రివిక్రమ్ పనిచేయడం ఖాయమని ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్త షికార్లు చేస్తోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా చిరంజీవి చేసిన జై చిరంజీవలో కామెడీ ఎంతలా హైలైట్ అయ్యిందో మనందరం చూసాం. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తే అది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అవుతుందట. ఆ చిత్రం కూడా కామెడీ ప్రధానంగా సాగుతుందని సమాచారం. త్రివిక్రమ్, చిరు ఇద్దరికీ కామెడీ ప్రధాన బలం కావడంతో వీరి కాంబినేషన్ లో సినిమా అంటే అది ప్రేక్షకులకు కనువిందే.

అయితే ఎలా చూసినా ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. మరి అప్పటికి సమీకరణాలు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.