త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమా విషయంలో కొత్త ట్విస్ట్


త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమా విషయంలో కొత్త ట్విస్ట్
త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమా విషయంలో కొత్త ట్విస్ట్

అజ్ఞాతవాసి చిత్రంతో అందరికీ షాక్ ను కలిగించే ప్లాప్ ను ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే దాన్నుండి తేరుకుని తన పంథాకు భిన్నంగా వెళ్లి అరవింద సమేత చిత్రాన్ని ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించి సూపర్ హిట్ సాధించాడు. మళ్ళీ తన పాత రూట్ లోకే వచ్చి ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా చేసిన అల వైకుంఠపురములో సూపర్ డూపర్ హిట్ సాధించే దిశగా దూసుకుపోతోంది. తొలిరోజే ఈ చిత్రం దాదాపు 26 కోట్ల మేర వసూలు చేసి బంపర్ ఓపెనింగ్స్ సాధించింది. టాక్ కూడా బాగుండడంతో ఈ సినిమా సూపర్ హిట్ సాధించడం ఖాయం. త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు అలవాటైన జోనర్లోనే హిట్ కొట్టి అందరినీ సంతృప్తి పరిచాడు. ఈ సినిమాతో తన ఫ్యాన్స్ కు మళ్ళీ ఖుషీ చేసాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ ఇప్పుడు ఫుల్ ఫ్లో లోకి వచ్చేసినట్లే. అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి చిత్రం ఏంటనే దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాతి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయనున్నాడని ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు.

అయితే అంతా కన్ఫర్మ్ అనుకుంటున్న సమయంలో ఇప్పుడు లేటెస్ట్ గా ఒక ట్విస్ట్ వచ్చి చేరింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమాను ప్రభాస్ తో చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. నిజానికి త్రివిక్రమ్ బాహుబలి సమయంలోనే ప్రభాస్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేసాడు. కాకపోతే అది బాగా ఆలస్యం అవుతుండడంతో ఆ ప్రాజెక్ట్ కుదర్లేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ తో సినిమా కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్, ప్రభాస్ తో ఎవరితో ముందుకు వెళ్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.