నారప్పా… వెంకీని ట్రోల్ చేయడమేంటి బాసు!


నారప్పా... వెంకీని ట్రోల్ చేయడమేంటి బాసు!
నారప్పా… వెంకీని ట్రోల్ చేయడమేంటి బాసు!

విక్టరీ వెంకటేష్.. ఏ మాత్రం యాంటీ ఫ్యాన్స్ లేని హీరోల్లో ముందువరసలో ఉండే హీరో వెంకటేష్. అందరి హీరోల అభిమానులు ఇష్టపడే హీరో ఈయన. ఏ మాత్రం భేషజాలు లేకుండా అందరితో చాలా సులువుగా కలిసిపోయే మనస్తత్వం వెంకీ మామ సొంతం. అందుకే ఆయన హిట్ కొడితే అందరూ ఆనందిస్తారు. ఆయన సినిమా ప్లాప్ అయిందంటే అందరూ బాధపడతారు. తన తరం హీరోల దగ్గరనుండి ఈ తరం హీరోల వరకూ అందరితో ఇట్టే కలిసిపోగలడు వెంకీ. మల్టీస్టారర్లు చేయడంలో ఎప్పుడూ ముందుండే వెంకీ మీద ట్రోలింగ్ అనేది అస్సలు ఉండదు. సోషల్ మీడియా ఉదృతి పెరిగాక ఈ ట్రోలింగ్ బారిన ప్రతి స్టార్ హీరో పడ్డాడు కానీ వెంకీ మామకు అది ఏక్సెప్షన్. అంతటి గౌరవం పొందుతుంటారు వెంకటేష్.

అయితే ఇప్పుడు వెంకీ మీదే ట్రోలింగ్ నడుస్తుండడం విచారకరం. అయితే ఈ ట్రోలింగ్ చేస్తోంది మన వాళ్ళు కాదు. తమిళ ప్రేక్షకులు. నిన్న రాత్రి వెంకటేష్ చేస్తోన్న అసురన్ రీమేక్ నారప్పకు సంబంధించిన ఫస్ట్ లుక్ స్టిల్స్ విడుదల చేసారు. అందులో వెంకీ టెరిఫిక్ గా ఉన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ గా వచ్చిన నాలుగైదు పోస్టర్స్ లో వెంకీ అదరగొట్టాడు. ఈ సినిమా మీద సరైన అంచనాలు ఏర్పడ్డాయి ఈ పోస్టర్స్ ద్వారా. తెలుగు ప్రేక్షకులు ఈ లుక్స్ తో తెగ ఇంప్రెస్ అయిపోయి ధనుష్ కంటే వెంకీకే ఈ లుక్ సెట్ అయిందంటూ కామెంట్స్ చేయడంలో అరవ జనాలకు నచ్చలేదు. దీంతో రియల్ అసురన్ ధనుష్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. అంతేనా వెంకీ మీద ట్రోలింగ్ మొదలుపెట్టారు.

అయితే వీటికి మన ప్రేక్షకులు కూడా రిటార్డ్ ఇస్తున్నారు. మన చిత్రాల్ని తమిళ హీరోలు రీమేక్స్ చేసారు. అందులో చెత్తగా ఆడినవి, అసలు సూట్ అవ్వనివి అన్నీ లిస్ట్ బయటకి తీసి ట్రోలింగ్ చేసేవారికి కౌంటర్లు ఇస్తున్నారు. వెంకీ మీద ట్రోలింగ్ కావడంతో అందరి హీరోల అభిమానులు కలిసి మరీ సోషల్ మీడియాలో స్పందిస్తుండడం విశేషం. నిజానికి ఇది సోషల్ మీడియా వరకే పరిమితమైంది. దాని గురించి మరీ సీరియస్ గా తీసుకోకపోవడమే మంచిది.