కేసీఆర్ కు షాక్ ఇస్తున్న వివేక్TRS leader Vivek to join in BJP
TRS leader Vivek to join in BJP

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు షాక్ ఇస్తూ బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమయ్యాడు టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ . సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వెంకటస్వామి కుటుంబం , కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది . వెంకటస్వామి వారసులుగా వచ్చిన గడ్డం వివేక్ , వినోద్ లు ఇప్పుడు రాజకీయంగా సైలెంట్ అయ్యారు .

గత ఎన్నికల సమయంలో వివేక్ కు పార్లమెంట్ స్థానం దక్కుతుందని ఆశించాడు అయితే కేసీఆర్ వివేక్ కు టికెట్ నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేయడమే కాకుండా టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేసాడు . ఇక ఈరోజు ఢిల్లీ వెళ్లి అమిత్ షా సమక్షంలో బీజేపీ లో చేరనున్నాడు . బీజేపీ లో చేరాకా రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది .