బాలయ్యని ఘోరంగా అవమానించిన తలసాని


TRS MLA Talasani Srnivivas yadav insults balakrishna
Talasani Srnivivas yadav

మాజీ మంత్రి , సనత్ నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ నందమూరి బాలకృష్ణ ని ఘోరంగా అవమానించాడు. అసలు మాట్లాడటమే చేతకాని హీరోని తీసుకొచ్చి ఎందుకు ప్రచారం చేయించారో అర్ధం కావడం లేదని , హాయిగా ఇంట్లో కూర్చుంటే సరిపోయేదిగా అంటూ బాలయ్య నుద్దేశించి ఎద్దేవా చేసాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ . టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు కు తెలంగాణ ప్రజలు తగిన బుద్ది చెప్పారని , బాలయ్య కు మాట్లాడటమే చేతకాదు బుల్ బుల్  అంటూ ఏం మాట్లాడతాడో కూడా తెలియదని  ఘోరంగా విమర్శించాడు .

తెలంగాణలో ఇటీవలే జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే . తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ తో జతకలిసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది . తెలంగాణ రాష్ట్ర సమితి కి అంతకుముందు కంటే అద్భుతమైన మెజారిటీ వచ్చింది . ఇక బాలయ్య తెలంగాణ లో ప్రచారం చేసి బుల్ బుల్ అంటూ తన ఇమేజ్ ని దారుణంగా దెబ్బ తీసుకున్నాడు .

English Title: TRS MLA Talasani Srinivas yadav insults balakrishna