బ్లాక్ బ‌స్ట‌ర్ సీక్వెల్..దేశాల్లో ఆపరేషన్!

బ్లాక్ బ‌స్ట‌ర్  సీక్వెల్..దేశాల్లో ఆపరేషన్!
బ్లాక్ బ‌స్ట‌ర్ సీక్వెల్..దేశాల్లో ఆపరేషన్!

కొన్ని కాంబినేష‌న్‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ల‌కి కేరాఫ్ అడ్ర‌స్‌లుగా మార‌తాయి. అలాంటి కాంబినేష‌న్‌లు మ‌ళ్లీ మ‌ళ్లీ క‌లిసి సినిమాలు చేస్తే చూడాల‌ని ప్రేక్ష‌కుల‌కు కూడా చాలా ఆస‌క్తితో ఎదురుచూస్తుంటారు. అలాంటి హిట్ కాంబినేష‌న్ ఏ.ఆర్‌. మురుగ‌దాస్‌, హీరో విజ‌య్‌ల‌ది. వీరిద్ద‌రి క‌లయిక‌లో వ‌చ్చిన `తుపాకి` ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ వ‌స్తే బాగుంటుంద‌ని సినీ ప్రేమికులు కోరుకున్నారు. త్వ‌ర‌లోనే వారి కోరిక‌ నెర‌వేర‌బోతోంది.

`తుపాకి`లో విజ‌య్ పాత్ర‌ని డిజైన్ చేసిన తీరు. స్లీప‌ర్ సెల్స్ అంటే ఏంటీ? ఎవ‌రు వాళ్లు?.. ఎలాంటి విధ్వంసాల‌కు పాల్ప‌డ‌తార‌న్న విష‌యాల్ని స‌గ‌టు వ్య‌క్తికి ఆర్థ‌మ‌య్యేలా చేసిన చిత్ర‌మిది. ఇందులో జ‌గ‌దీష్ అనే ఆర్మీ ఆఫ‌సీస‌ర్‌గా విజ‌య్ చాలా కొత్త‌గా న‌టించారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఆక‌ట్టుకున్న ఈ చిత్రానికి త్వ‌ర‌లోనే సీక్వెల్‌ని తీసుకురావాల‌నే ఆలోచ‌న‌లో వున్న‌ట్టు ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ వెల్ల‌డించడం ఆస‌క్తిక‌రంగా మారింది.

అయితే సీక్వెల్ మాత్రం అంత‌ర్జాతీయ ఆప‌రేష‌న్ నేప‌థ్యంలో వుంటుంద‌ని, దానికి సంబంధించిన ఐడియా కోసం ఎదురుచూస్తున్నాన‌ని, వ‌న్స్ ఐడియా రాగానే స్క్రిప్ట్‌ని పూర్తి చేస్తాన‌ని, ఆ త‌రువాతే `తుపాకి 2`ని తెర‌పైకి తీసుకొస్తాన‌ని ద‌ర్శ‌కుడు ఇటీవ‌ల త‌న‌ని ప్రశ్నించిన మీడియాకు వెల్ల‌డించార‌ట‌. మురుగ‌దాస్ ప్ర‌స్తుతం ర‌జ‌నీతో `ద‌ర్బార్‌` చిత్రాన్ని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.