బాలీవుడ్‌లో మ‌రో విషాదం! 

Tv actor sameer sharma commits suicide
Tv actor sameer sharma commits suicide

వ‌రుస విషాదాలు వెంటాడుతున్నాయి. సినీ స్టార్స్ , టెలివిజ‌న్ న‌టులు వ‌రుస‌గా మృత్యువాత ప‌డుతున్నారు. ఇందులో కొంత మంది  అనారోగ్యంతో మృతి చెంద‌గా కొంత మంది క‌రోనాతో, మ‌రి కొంత మంది ఆత్మ హ‌త్య‌కు పాల్ప‌డి మ‌ర‌ణించారు. ఇక యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ హ‌త్యోదంతం మిస్టరీగా మారి సంచ‌ల‌నం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. సుశాంత్ కేసుని కేంద్రం తాజాగా సీబీఐకి ప్ప‌గించింది.

ఇదిలా వుంటే తాజాగా బాలీవుడ్‌లో మ‌రో న‌టుడు ఆత్మ హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. టీవీ న‌టుడు స‌మీర్ శ‌ర్మ (44) ఆత్మ హ‌త్య చేసుకున్నారు. ఈ విష‌యం గురువారం వెలుగులోకి వ‌చ్చింది. ప‌శ్చిమ మ‌లాద్‌లోని అహింసా మార్గ్‌లోని త‌న నివాసంలో స‌మీర్ శ‌ర్మ త‌న అపార్ట్‌మెంట్ సీలింగ్‌కి ఉరివేసుకుని క‌నిపించ‌డాన్ని బుధ‌వారం రాత్రి అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ గ‌మ‌నించి సొపైటీ స‌భ్యుల‌కు తెలియ‌జేశార‌ట‌. దీంతో సొసైటి  స‌భ్యులు పోలీసుల‌కు స‌మాచారం అందించార‌ట‌.

ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసుల స‌మీర్ శ‌ర్మ బాడీని పోస్ట్ మార్ట‌మ్ నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించార‌ట. ఘ‌ట‌నా స్థ‌లంలో ఎలాంటి సుపైడ్ నోట్ ల‌భించ‌లేద‌ని, రెండు రోజుల క్రిత‌మే స‌మీర్ శ‌ర్మ ఆత్మ హ‌త్య చేసుకుని వుంటాడ‌ని పోలీసులు గ‌మ‌నించిన‌ట్టు తెలిసింది. స‌మీర్‌శ‌ర్మ ఘ‌ర్ ఘ‌ర్ కీ క‌హానీ, క్యోంకీ సాస్ బీ క‌బీ బ‌హు థీ, హే రిస్తే హై ప్యార్ కే వంటి పాపుల‌ర్ సీరియ‌ల్స్‌లో న‌టించారు.