సుధీర్ ని పెళ్లి చేసుకున్న టీవీ నటి


Asmitha Sudheer
Sudheer and Asmitha

టీవీ నటి అస్మిత సుధీర్ ని పెళ్లి చేసుకుంది . తెలుగులో పలు సీరియల్ లలో అలాగే పలు తెలుగు చిత్రాల్లో నటించింది అస్మిత . సుధీర్ ని పెళ్లి చేసుకుంది అనగానే జబర్దస్త్ సుధీర్ అనుకోవద్దు సుమా ! ఆ సుధీర్ వేరు అస్మిత ప్రేమించి పెళ్లి చేసుకున్న సుధీర్ వేరు . ఆ సుధీర్ నటుడు కాగా ఈ సుధీర్ కొరియోగ్రాఫర్ .

కొంత కాలంగా కొరియోగ్రాఫర్  సుధీర్ – నటి అస్మిత లు ప్రేమించుకుంటున్నారు . ఇక ప్రేమని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న ఈ జంట పెళ్లి చేసుకుంది . సుధీర్ – అస్మిత ల పెళ్ళికి పలువురు టీవీ నటీనటులు హాజరై శుభాకాంక్షలు అందజేశారు . ప్రస్తుతం అస్మిత పలు తెలుగు సీరియల్ లలో నటిస్తోంది .