కారు యాక్సిడెంట్ లో టివి ఆర్టిస్ట్ లు మృతి


Anusha Reddy and Bhargavi ( అనూష రెడ్డి మరియు భార్గవి )
Anusha Reddy and Bhargavi ( అనూష రెడ్డి మరియు భార్గవి )

కారు యాక్సిడెంట్ లో ఇద్దరు టివి ఆర్టిస్ట్ లు చనిపోవడంతో బుల్లితెర పై విషాదం నెలకొంది . అనూష రెడ్డి (21) , భార్గవి (20)అనే నటీమణులు చనిపోయారు . తీవ్ర విషాదం నింపిన ఈ సంఘటన మొయినా బాద్ మండలం అప్పారెడ్డి గూడ బస్టాండ్ దగ్గర జరిగింది . టివి సీరియల్ లలో నటించే అనూష రెడ్డి , భార్గవి ల జీవితాలు అర్దాంతరంగా చాలించడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది .

బుల్లితెర లో నటించే అనూష రెడ్డి , భార్గవి లు మణికొండ లో జీవిస్తున్నారు . చక్రి , వినయ్ కుమార్ లతో కలిసి ఫోటో షూట్ కోసం వికారాబాద్ అడవుల్లోని అనంతగిరి కొండలకు వెళ్లారు . అయితే హైదరాబాద్ నుండి అర్ధరాత్రి వెళ్లారు , షూట్ పూర్తిచేసుకొని తెల్లవారు ఝామున తిరిగి హైదరాబాద్ కు బయలుదేరారు . అయితే మొయినాబాద్ మండలం అప్పారెడ్డి బస్టాండ్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ ని తప్పించబోయి పక్కకు తిప్పడంతో చెట్టుని డీ కొట్టడంతో కారు తుక్కు తుక్కు అయ్యింది దాంతో ముందు కూర్చున్న భార్గవి అక్కడికక్కడే చనిపోగా అనూష రెడ్డి ని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో చనిపోయింది . ఇక చక్రి , వినయ్ లకు స్వల్ప గాయాలయ్యాయి .