హిట్ సినిమాకు షాక్ ఇచ్చిన కార్తీక దీపం !!!


Karthika Deepam
Karthika Deepam

కొత్త సినిమా టివిలో వస్తోంది అంటే సీరియల్స్ ని మానేసి ఎంతో కొంత సినిమాపై ఓ లుక్కేస్తాం. అయితే కొన్ని సీరియల్స్ ఇటీవల కాలంలో పెద్ద సినిమాల టిఆర్పీలకు సైతం ఎసరేట్టేస్తున్నాయి. గత కొన్నాళ్లుగా కార్తీక దీపం అయితే నాన్ స్టాప్ TRP రికార్డులతో అందరిని షాక్ కి గురి చేస్తోంది. సినిమా ఎంత కొత్తది వచ్చినా ఛానెల్ మార్చేది లేదు. రిమోట్ పట్టినవాడు సీరియల్ అయిపోయే దాకా మార్చడానికి వీలు లేదు.  ఆడవాళ్లు ఆ సీరియల్ కి దాదాపు ఎడిక్ట్ అయ్యారనే చెప్పాలి.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ టివి ప్రీమియర్స్ పడిన రోజు ఒక సీరియల్ టిఆర్పి తగ్గకపోవడం గమనార్హం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఏ స్థాయిలో వసూళ్లను అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా ఈ నెల 13న మొదటి సారి టివిలో ప్రసారం కాగా 16.3 రేటింగ్ ని సాధించింది. ఇది మంచి మంచి రేటింగ్ అయినప్పటికీ కార్తీక దీపం సీరియల్ ని తాకలేకపోయింది.
ఆ సీరియల్ ఎవరు ఊహించని విధంగా 18.3 రేటింగ్ సాధించింది. ప్రతి రోజు ఈ డైలీ సీరియల్ మినిమమ్ 15కి టిఆర్పీ తో దసుకుపోతోంది. ఒక బర్త్ డే పార్టీని సీరియల్ లో రెండు వారాలకు పైగా కొనసాగించినప్పటికి జనాలు ఏ మాత్రం విసుక్కోకుండా చూస్తున్నారు అంటే సీరియల్ డోస్ ఎలా ఎక్కిందో అర్థం చేసుకోవచ్చు. పైగా ఒక స్టార్ హీరో సినిమాకి కూడా దక్కని సరికొత్త రికార్డులు ఈ సీరియల్ దక్కించుకోవడం చూస్తుంటే భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పడం పక్కా అనిపిస్తోంది.