శ్యామ్ కె. నాయుడు చీటింగ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్‌!


శ్యామ్ కె. నాయుడు చీటింగ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్‌!
శ్యామ్ కె. నాయుడు చీటింగ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్‌!

ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కె. నాయుడు సోద‌రుడు శ్యామ్ కె. నాయుడు పై న‌టి సాయి సుధ చీటింగ్ కేసు పెట్టిన విష‌యం తెలిసిందే. త‌న‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి శ్యామ్‌ కె. నాయుడు త‌న‌ని వాడుకుని మోసం చేశాడని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అంతే కాకుండా అత‌నిపై ఎస్‌.ఆర్ న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేయ‌డం టాలీవుడ్‌లో క‌ల‌క‌లాన్ని రేపింది.

శ్యామ్‌ కె. నాయుడిని అరెస్ట్ చేసిన ఎస్‌.ఆర్‌. న‌గ‌ర్ పోలీసులు ఆ త‌రువాత అత‌న్ని రిమాండ్‌కు త‌ర‌లించారు. రెండు రోజుల్లోనే బెయిల్‌పై శ్యామ్ కె. నాయుడు బెయిల్‌పై బ‌య‌టికి వ‌చ్చారు. అయితే శ్యామ్ కె. నాయుడికి బెయిల్ రావ‌డం వెన‌క అదిరిపోయే ట్విస్ట్ వుంద‌ని తెలిసింది.  వివాదానికి ప్ర‌ధాన కార‌కులైన సాయి సుధ త‌న‌తో కాంప్రమైజ్ అయిన‌ట్టు శ్యామ్ కె. నాయుడు సంబంధిత కోర్టులో ఆధారాలు స‌మ‌ర్పించ‌డంతో నాంప‌ల్లి కోర్టు అత‌నికి బెయిల్ మంజూరు చేసింది. ‌

అయితే ఈ విష‌యం తెలుసుకున్న సాయి సుధ త‌ను శ్యామ్ కె. నాయుడితో కాంప్ర‌మైజ్ కాలేద‌ని, త‌న సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేసి బెయిల్ పిటీష‌న్ వేసిన‌ట్టు తెలిపిన సాయి సుధ బెయిల్ పిటీష‌న్‌ను స‌వాల్ చేస్తూ కోర్టుని ఆశ్ర‌యించింది. దొంగ సంత‌కం ద్వారా బెయిల్‌కు తాను అంగీక‌రించిన‌ట్టు న‌కిలీ ప‌త్రాల్ని సృష్టించాడ‌ని న్యాయ‌స్థానానికి వెల్ల‌డించ‌డంతో విచార‌ణ చేప‌ట్టిన నాంప‌ల్లి కోర్టు శ్యామ్ కె. నాయుడి బెయిల్‌ని రద్దు చేసింది.