బాల‌య్య కొసం ఇద్ద‌రు క్రేజీ హీరోయిన్‌లు!


బాల‌య్య కొసం ఇద్ద‌రు క్రేజీ హీరోయిన్‌లు!
బాల‌య్య కొసం ఇద్ద‌రు క్రేజీ హీరోయిన్‌లు!

`రూల‌ర్‌` సినిమా త‌రువాత నంద‌మూరి బాల‌కృష్ణ త‌న 106వ చిత్రానికి ఇటీవ‌లే శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాల‌య్య కొత్త‌గా క‌నిపించ‌బోతున్నార‌ట‌. అందు కోస‌మే ఆయ‌న స‌ర్జ‌రీ చేయించుకున్నార‌ట‌. గుండుతో క‌నిపిస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా ఇద్ద‌రు క్రేజీ క‌థానాయిక‌లు న‌టించే అవ‌కాశం వుంద‌ని తెల‌సింది.

ఇందులో సోనాల్ చౌహాన్ న‌టిస్తుంద‌ని, లేదు అంజ‌లిని అనుకుంటున్నార‌ని కొంత మంది ప్ర‌చారం జేస్తున్న విష‌యం తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా శ్రియ‌, `సింహా` త‌ర‌హాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో క‌నిపించే హీరోయిన్‌గా న‌య‌న‌తార న‌టించ‌రున్నార‌ని తెలిసింది. ముందు ఈ చిత్రంలోని ఓ హీరోయిన్‌గా కేథ‌రిన్ న‌టిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి ఆమెని ఫైన‌ల్ కూడా చేశారు. అయితే మ‌ధ్య‌లో ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ అ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాక‌ముందే ఈ చిత్రం నుంచి కేథ‌రిన్ త‌ప్పుకుంది.

దీంతో ఇద్ద‌రు హీరోయిన్‌ల కోసం అన్వేష‌ణ మొద‌లుపెట్టిన బోయ‌పాటి శ్రీ‌ను చివ‌రికి న‌య‌న‌తార, శ్రియ‌ల‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. న‌య‌న‌తార సింహా, జై సింహా చిత్రాల్లో బాల‌య్య‌తో క‌లిసి న‌టించింది. ఇక శ్రియ `చెన్నకేశ‌వ‌రెడ్డి`, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, పైసా వ‌సూల్ చిత్రాల్లో న‌టించింది. ఇది బాల‌య్య‌తో ఆమెకు నాలుగ‌వ సినిమా.