అల్లు అర్జున్ కోసం ఇద్దరు దర్శకులు వెయిటింగ్


Two directors are waiting for allu arjun

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది దాంతో అల్లు అర్జున్ తదుపరి చిత్రంపై ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఎవరి తో ఉంటుంది ? దర్శకుడు ఎవరు ? అంటే ఇప్పుడు అల్లు అర్జున్ కోసం ఇద్దరు దర్శకులు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఒకరేమో టాప్ డైరెక్టర్ కాగా మరొకరు విభిన్న చిత్రాల దర్శకుడు దాంతో ఆ ఇద్దరిలో అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడో అన్న ఆత్రుత నెలకొంది. ఇక అల్లు అర్జున్ తో సినిమా కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న టాప్ డైరెక్టర్ ఎవరో తెలుసా ……. కొరటాల శివ . అవును మహేష్ బాబు తో తాజాగా భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని చేయడానికి సమాయత్తం అవుతున్నాడు.

కొరటాల శివకు అల్లు అర్జున్ మాత్రమే అందుబాటులో ఉన్నాడు . మిగతా అగ్ర హీరోలు ఇతర సినిమాలతో బిజీ గా ఉన్నారు కాబట్టి కొరటాల శివ కు మంచి ఛాయిస్ అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ కూడా కొరటాల శివ తో సినిమా చేయడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక రెండో దర్శకుడు విషయానికి వస్తే …… విక్రమ్ కుమార్ అనే దర్శకుడు అల్లు అర్జున్ కోసం ఓ విభిన్న కథ ని సిద్ధం చేసాడట . విక్రమ్ కుమార్ అంటే విభిన్న కథా చిత్రాల దర్శకుడు అన్న విషయం తెలిసిందే దాంతో అతడితో కూడా సినిమా చేయడానికి అల్లు అర్జున్ ఉత్సాహపడుతున్నాడట. అయితే ఈ ఇద్దరి దర్శకులతో ముందుగా ఎవరితో అల్లు అర్జున్ సినిమా చేస్తాడో చూడాలి. సహజంగా కొరటాల శివ తో సినిమా చేస్తాడనే అనుకుంటున్నారు. మరి అల్లు అర్జున్ ఎవరికి ఒకే చెబుతాడో ? ఎవరిని వెయిటింగ్ లిస్ట్ లో పెడతాడో చూడాలి .