డిస్కషన్ అంతా అల వైకుంఠపురములోలో ఆ రెండు సీన్స్ గురించే

డిస్కషన్ అంతా అల వైకుంఠపురములోలో ఆ రెండు సీన్స్ గురించే
డిస్కషన్ అంతా అల వైకుంఠపురములోలో ఆ రెండు సీన్స్ గురించే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో ఫస్ట్ డే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సర్వత్రా సరిలేరు నీకెవ్వరు కంటే బెటర్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ జోడీ హ్యాట్రిక్ సాధించడంలో సక్సెస్ అయింది. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ తో హ్యాట్రిక్ కొట్టడంలో విఫలమయ్యాడు. అజ్ఞాతవాసి చిత్రం అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమై చతికిలపడ్డ సంగతి తెల్సిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి హిట్టు కొట్టాడు. క్లాస్ గా చిత్రాన్ని ప్రెజంట్ చేస్తూనే తనదైన శైలిలో అభిమానులను అలరించే సీన్లకు కూడా ఢోకా లేకుండా చూసుకున్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు సీన్స్ దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్థాయిని తెలియజేస్తున్నాయి. చాలా సాధారణంగా అనిపించగల ఈ సీన్స్ ను త్రివిక్రమ్ లేపిన విధానం హైలైట్.

ముందుగా బోర్డు మీటింగ్ సీన్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తుంది. అల్లు అర్జున్.. దాదాపు అందరు స్టార్ హీరోలైన మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి హీరోల సాంగ్స్ కు డ్యాన్స్ వేయడం.. ఆ తర్వాత వచ్చే డైలాగులు ప్రేక్షకులను కుదురుగా సీట్లో కూర్చోనివ్వవు. ఒక స్టార్ హీరో ఇలా మిగతా స్టార్ హీరోల సినిమాలకు డ్యాన్స్ లు చేయడం నిజంగా చూడటానికి ప్రేక్షకులకు భలే థ్రిల్ ను ఇచ్చింది.

ఇక క్లైమాక్స్ ముందు వచ్చే మరో ఫైట్ కూడా త్రివిక్రమ్ ప్రతిభను తెలియజేస్తుంది. సాధారణంగా అన్ని సినిమాల్లో చూపించినట్లుగానే ఇందులో కూడా క్లైమాక్స్ కు ముందు విలన్ గ్యాంగ్ దగ్గరకు వెళ్లి వాళ్ళని కొట్టి రావాలి. హీరో వెళ్లి రౌడీలను కొట్టి రావడం చాలా సాధారణమైన విషయమే. అందుకే త్రివిక్రమ్ ఇక్కడ శ్రీకాకుళం పాట ఒకటి పెట్టాడు. ఆల్బమ్ లో రిలీజ్ చేయని ఈ పాట జనాలకు పిచ్చగా నచ్చుతోంది. సాధారణంగా ఫైట్ కు తగ్గట్లుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేస్తారు, కానీ ఇక్కడ పాటకు తగ్గట్లుగా ఫైట్ కంపోజ్ చేసారు. సినిమా పరంగా చాలా హైలైట్స్ ఉన్నా ఇవి ఎక్కువగా జనాలు మాట్లాడుకుంటున్నారు.