రెండు నెలలు 2 హిట్స్ మాత్రమే !


Two months two hits

2019 లో నిన్నటితో రెండు నెలలు పూర్తయ్యాయి . అయితే ఈ రెండు నెలల్లో ఒక్కటే సాలిడ్ హిట్ , మరొకరి యావరేజ్ . జనవరిలో రిలీజ్ అయిన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ అయి 140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించింది . ఇది మాత్రమే సాలిడ్ హిట్ అన్నమాట . జనవరిలో రిలీజ్ అయిన మిగతా చిత్రాలు ఘోర పరాజయం పొందాయి .

 

ఇక ఫిబ్రవరిలో కూడా చాలా చిత్రాలే రిలీజ్ అయ్యాయి కానీ ఒక్క సూపర్ హిట్ కూడా లేదు కానీ వై ఎస్సార్ బయోపిక్ అయిన యాత్ర మంచి వసూళ్ల ని రాబట్టింది . ఇది కూడా పెద్ద హిట్ ఏమి కాదు కానీ యావరేజ్ ని మించింది కాబట్టి ఓవరాల్ గా హిట్ అన్నట్లే ! రెండు నెలల్లో రెండు హిట్ చిత్రాలన్న మాట ! ఇక ఈరోజు మూడో నెల స్టార్ట్ అయ్యింది . మరి ఈ నెలలో ఏదైనా హిట్ లభిస్తుందో ? లేదో ! ఈనెల ఎలా ఉంటుందో ?

English Title: Two months two hits