కేజిఎఫ్ చాప్టర్ 2 ముందు రెండు ఆప్షన్స్

కేజిఎఫ్ చాప్టర్ 2 ముందు రెండు ఆప్షన్స్
కేజిఎఫ్ చాప్టర్ 2 ముందు రెండు ఆప్షన్స్

కేజిఎఫ్ చాప్టర్ 1 ఎంతటి సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. వేరే భాషల్లో అందరి అంచనాలను తలకిందులు చేసింది. తెలుగు మరియు హిందీలలో మేజర్ సక్సెస్ ను చవిచూసింది ఈ చిత్రం. ఇదిలా ఉంటే కేజిఎఫ్ చాప్టర్ 2పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. జులైలో విడుదల చేద్దామనుకున్నారు. ఈలోగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతబడ్డాయి. ఇక ఇప్పుడు థియేటర్లు మళ్ళీ తెరుచుకుంటుండడంతో కేజిఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ డేట్ విషయంలో ఆలోచన మొదలైంది.

ముందు దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయాలి అనుకున్నా అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ భారీ సినిమాల పోటీని తట్టుకోవాలి. అందుకే సెప్టెంబర్ 9న విడుదల చేద్దామనుకుంటున్నారు. ఒకవేళ అది జరగకపోతే కనుక క్రిస్మస్ కు విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.