కేసీఆర్, జగన్‌తో రెండు రాష్ట్రాల అభివృద్ధి: శ్రీనివాస్‌గౌడ్Srinivas Goud
Srinivas Goud

ఆనాడు ఉద్యమనేతగా ఉన్న కేసీఆర్.. విడిపోయి కలిసుందామన్నారని, కానీ, కొందరు నాయకులు విద్వేషాలు సృష్టించారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నీటియుద్ధాలు వస్తాయని, హైదరాబాద్‌లో ఉండలేరంటూ వదంతులు సృష్టించారని గుర్తుచేశారు. అలాంటి నాయకుల లోపంవల్ల ఎన్నో లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలిసిపోయాయని చెప్పారు.

తెలంగాణ వచ్చాక హైదరాబాద్‌లో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. వైఎస్ జగన్‌లాంటి మంచి నాయకుడు ముఖ్యమంత్రి కావడం శుభపరిణామమని కొనియాడారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలను విడదీయలేరన్న శ్రీనివాస్‌గౌడ్.. కొట్లాడకుండా నీళ్లను వాడుకుందామని చెప్పారు.