ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్ పేరిదేనా?


ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్ పేరిదేనా?
ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్ పేరిదేనా?

వివాదాస్ప‌ద చిత్రాల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ క‌రోనా వైర‌స్‌ని కూడా లెక్క‌చేయ‌కుండా వ‌రుస‌గా త‌న ఓటీటీకి సినిమాల‌ని అందిస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు. క్లైమాక్స్‌, నేక్డ్ వంటి చిత్రాల‌తో ర‌చ్చ చేసిన వ‌ర్మ ఇటీవ‌ల ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ చేసిన `‌ప‌వ‌ర్‌స్టార్‌` చిత్రంతో చేయాల్సినంత ర‌చ్చ చేశారు. ఇప్పుడు ఆయ‌న దృష్టి మ‌రిన్ని వివాదాస్ప‌ద చిత్రాల‌పై ప‌డింది.

మిర్యాల‌గూడ ప‌రువు హ‌త్య నేప‌థ్యంలో `మ‌ర్డ‌ర్‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న వ‌ర్మ తాజాగా ట్రైల‌ర్‌ని కూడా రిలీజ్ చేసి కొన్ని ప్ర‌శ్న‌ల్ని కూడా సంధించారు. ఇదిలా వుంటే ఈ సినిమాల త‌రువాత వ‌ర్మ ల‌వ‌ర్ బాయ్ ఉద‌య్ కిర‌ణ్ జీవిత క‌థ ఆధారంగా ఓ బ‌యోపిక్‌ని తెర‌పైకి తీసుకురాబోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై వ‌ర్మ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. క‌నీసం ట్వీట్ వేయ‌లేదు.

అయితే ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్ కు వ‌ర్మ సైలెంట్‌గా రెడీ అవుతున్నార‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ చిత్రం కోసం `హృద‌య్ కిర‌ణ్‌` అనే టైటిల్‌ని కూడా క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్టు చెబుతున్నారు. వ‌రుస విజ‌యాల్ని సాధిస్తూ అప్ప‌ట్లో ఉద‌య్‌కిర‌ణ్ యువ హీరోల్లో సంచ‌ల‌నం సృష్టించారు. ఆ త‌రువాత ఉద‌య్ ఇండ‌స్ట్రీలో వున్న బంధు ప్రీతి కార‌ణంగానే ఆత్మ హ‌త్య‌కు పాల్ప‌డ్డార‌ని ఇండ‌స్ట్రీ అంతా చెప్పుకుంది. ఇదే ఇప్పుడు వ‌ర్మ‌కు ఆయుధంగా మారింద‌ని, దీనికి సంబంధించిన న్యూస్‌ని త్వ‌ర‌లోనే వ‌ర్మ ట్వీట్ రూపంలో వెల్ల‌డించ‌నున్నాడ‌ని చెబుతున్నారు.