త్వరలో “ఉమా మహేశ్వర – ఉగ్ర రూపస్య” సినిమా


Uma Maheswara Ugra Roopasya announcement video released
Uma Maheswara Ugra Roopasya announcement video released

అతని పేరు ఉమా మహేశ్వర రావు. అరకు వ్యాలీలో “కోమలి ఫోటో స్టూడియో” ఓనర్. స్వతహాగా చాల మంచివాడు. కానీ ఒకరోజు అనుకోకుండా తన తప్పు లేకపోయినా ఉమా మహేశ్వర రావు ఇంకొకరి చేతిలో దెబ్బలు తింటాడు. ఆ గొడవ తరువాత తనని కొట్టినవాడిని తిరిగి కొట్టేంత వరకూ చెప్పులు వేసుకోనని శపథం చేస్తాడు. ఆ విశేషాలు తెలియాలంటే “ఉమా మహేశ్వర – ఉగ్రరూపస్య” సినిమా చూడాల్సిందే అని డైరెక్టర్ వెంకటేష్ మహా అంటున్నారు.

C/O కంచెర పాలెం సినిమా తరువాత ఆయన చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను బాహుబలి లాంటి సినిమా చేసిన ఆర్కా మీడియా సంస్థ నిర్మాతగా వ్యవహరిస్తోంది. కేరాఫ్ కంచెర పాలెం సినిమా మాదిరిగానే ఈ సినిమాలో కూడా నిజజీవిత పాత్రలతోనే దర్శకుడు సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ లో హీరో సత్యదేవ్ నటిస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన చిన్న వీడియోలో ఆయనతో పాటు సీనియర్ నటులు పెద్ద నరేష్ గారు కూడా ఉన్నారు.

కేరాఫ్ కంచెర పాలెం లో నటించి ఆ సినిమాను నిర్మించిన విజయ ప్రవీణా పరుచూరి ఈ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత మలయాళం లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన బిజిబల్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ వీడియో లో ఆయన మ్యూజిక్ కి గొప్ప స్పందన వస్తోంది, ఇక ఈ సినిమా కేరాఫ్ కంచెర పాలెం కు మించి హిట్ అవ్వాలని కోరుకుందాం.