బ‌డ్జెట్‌కు మించి శాటిలైట్ రైట్స్‌!



uma maheswara ugra roopasya satellite rights sold out
uma maheswara ugra roopasya satellite rights sold out

మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన చిత్రం `మ‌హేష్ ఇంటే ప్ర‌తీకారం`. ఫార్హ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించారు. ఈ చిత్రాన్ని స‌త్య‌దేవ్ హీరోగా `ఉమా మ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌` పేరుతో `బాహుబ‌లి` మేక‌ర్స్ ఆర్కా మీడియా, ప‌రుచూరి ప్ర‌వీణ సంయుక్తంగా నిర్మించారు. కీల‌క పాత్ర‌ల్లో న‌రేష్‌, సుహాస్‌, జ‌బ‌ర్ద‌స్త్ రామ్ ప్ర‌సాద్ న‌టించారు. `కేరాఫ్ కంచ‌ర పాలెం` ఫేమ్ వెంక‌టేష్ మ‌హా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  ఇటీవ‌లే ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు.

ప్రేక్ష‌కుల నుంచి సెల‌బ్రిటీల నుంచి ఈ చిత్రానికి అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఉమా మ‌హేశ్వ‌రరావు పాత్ర‌లో స‌త్య‌దేవ్ జీవించాడ‌ని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో మంచి వ్యూస్‌ని సొంతం చేసుకుంటున్న ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి ఓ టీవీ ఛాన‌ల్ సొంతం చేసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. రెండు కోట్ల లోపు బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్ర శాటిలైట్ రైట్స్  2.5 కోట్ల‌కు అమ్ముడు పోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసై్తోంది.

ప్ర‌ముఖ టెలివిజ‌న్ సంస్థ ఈ టీవీ ఈ చిత్ర శాటిలైట్ హ‌క్కుల్ని ద‌క్కించుకుంది. చాలా కాలంగా క్రేజీ చిత్రాల శాటిలైట్ హ‌క్కుల్ని ద‌క్కించుకోలేక‌పోతున్న సంస్థ తొలి సారి `ఉమా మ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌`  చిత్రాన్ని భారీ మొత్తానికి సొంతం చేసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ చిత్రాన్ని ఈటీవీ త్వ‌ర‌లోనే ప్ర‌సారం చేయ‌నుంది.