సోనుసూద్‌కు అరుదైన గౌర‌వం!‌

సోనుసూద్‌కు అరుదైన గౌర‌వం!‌
సోనుసూద్‌కు అరుదైన గౌర‌వం!‌

క‌రోనా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న స‌మ‌యంలో అభాగ్యుల కోసం, వ‌ల‌స కూలీల కోసం నేనున్నానంటూ ముందుకొచ్చారు నటుడు సోనుసూద్‌. వెండితెర‌పై విల‌న్‌గా త‌న క్రూర‌త్వాన్ని చూపించిన ఆయ‌న రియ‌ల్ లైఫ్‌లో మాత్రం త‌నంత‌టి కారుణ్య‌మూర్తి లేడంటూ చేత‌ల్లో నిరూపించి ప్ర‌పంచ వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యారు.

ఆయ‌న‌కు తాజాగా అరుదైన అవార్డ్ ద‌క్కింది. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తించిన ఐరాస అనుబంధ సంస్థ యునైటెడ్ నేష‌న్స్‌డెవ‌లాప్‌మెంట్ ప్రోగ్రామ్ సొనుసూద్ కి ఎస్‌డీజీ స్పెష‌ల్ హ్యుమానిటేరియ‌న్ అవార్డుతో గౌర‌వించింది. వ‌ర్చువ‌ల్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న సోమ‌వారం సాయంత్రం ఈ అవార్డుని అందుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఐరాస పుర‌స్కారాన్ని అందుకున్న వారిలో హాలీవుడ్ స్టార్స్ ఏంజిలీనా జోలీ, డేవిడ్ బెక్‌హామ్‌, లియోనార్డో డికాప్రియో, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా వున్నారు. తాజాగా వీరి స‌ర‌స‌న సోనుసూద్ నిలిచారు. ఐరాస అవార్డు అందు కోస‌వ‌డం సంతోషంగా వుంద‌ని, త‌ను చేసిన సేవ‌ల్ని గుర్తించి అవార్డుని అందించార‌ని సోనుసూద్ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.