యువ నటుడి ని చితకబాదిన దుండగులు


unidentified men attacked on actor karthik vikramకన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన యువ నటుడు కార్తీక్ విక్రమ్ ని దుండగులు చితకబాదిన సంఘటన కన్నడనాట పెను సంచలనం సృష్టించింది . సంఘటన వివరాలలోకి వెళితే …… యువ నటుడు కార్తీక్ విక్రమ్ మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో తన స్నేహితుడిని అతడి ఇంటి వద్ద డ్రాప్ చేసి తిరిగి కే హెచ్ బి కాలనీ లో ఉన్న తన ఇంటికి వెళుతున్నాడు . అయితే ఇంటికి వెళుతున్న సమయంలో కిలోస్కర్ కాలనీ వద్ద కు రాగానే ఏడుగురు దుండగులు కార్తీక్ విక్రమ్ తో గొడవపడి చితక బాదడమే కాకుండా అతడి సెల్ ఫోన్ ని సైతం లాక్కొని కారుతో ఉడాయించారు .

 

గాయాల పాలైన కార్తీక్ విక్రమ్ ప్రస్తుతం ప్రవైట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు . కార్తీక్ విక్రమ్ పై జరిగిన దాడి పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు .