కేసీఆర్ , కేటీఆర్ లపై విమర్శలు చేసిన కిషన్ రెడ్డిKishan Reddy
Kishan Reddy

ప్రజలు వద్దనుకుంటే కేసీఆర్ సారూ ….. కారు ….. పదహారు …… కేంద్రంలో సర్కార్ ఇవేవి ఉండవని సంచలన వ్యాఖ్యలు చేసాడు కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి . తెలంగాణలో 2023 లో అధికారం భారతీయ జనతా పార్టీదే అంటూ ధీమా వ్యక్తం చేసాడు . నిన్న సికింద్రాబాద్ లో లంచ్ విత్ కిషన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా పలు కీలక వ్యాఖ్యలు చేసాడు .

రాష్ట్రంలో కేసీఆర్ మజ్లీస్ పార్టీతో కలిసి రాజకీయం చేస్తున్నాడని , కానీ మేము ఎన్నడూ మతపరమైన రాజకీయాలు చేయలేదని , జాతీయవాదంతో ముందుకు వెళ్తున్నామని అందుకే తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా 4 పార్లమెంట్ స్థానాలను గెల్చుకున్నామని , ప్రజలు కోరుకుంటే కేసీఆర్ , కారు సారూ ఇవేవి పనిచేయవని కేసీఆర్ ప్రభుత్వానికి చురకలు అంటించాడు . అంతేకాదు ప్రతీ పోలీస్ స్టేషన్ ని కేంద్రంలోని హోం శాఖకు అనుసంధానం చేస్తున్నామని , ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యానని అలాగే హైదరాబాద్ టెర్రరిజానికి అలవాలమయ్యిందని ఇది నేను చెబుతున్నది కాదు ఎన్ ఐ ఏ అరెస్ట్ లే దానికి రుజువు అంటూ టెర్రరిస్టుల ఆట కట్టిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసాడు కిషన్ రెడ్డి .