కేంద్ర‌మంత్రికి నిర్మాత‌ల కొత్త ప్ర‌తిపాద‌న‌!


కేంద్ర‌మంత్రికి నిర్మాత‌ల కొత్త ప్ర‌తిపాద‌న‌!
కేంద్ర‌మంత్రికి నిర్మాత‌ల కొత్త ప్ర‌తిపాద‌న‌!

లాక్‌డౌన్ కార‌ణంగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ స్థంభించిపోయింది. షూటింగ్‌లు ఆగిపోవ‌డంతో భారీ చిత్రాల నిర్మాత‌లంతా ఇబ్బందులు ప‌డుతున్నారు. `బాహుబ‌లి` త‌రువాత యావ‌త్ భార‌తీయ సినీ దిగ్గ‌జాల దృష్టి టాలీవుడ్‌పై ప‌డింది. మ‌రీ ముఖ్యంగా రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్‌` సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఆస‌క్తిగా చూస్తున్నారు. క‌రోనా కార‌ణంగా చిత్ర ప‌రిశ్ర‌మ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. షూటింగ్‌లు మొద‌లుపెడితే కానీ కార్మికుల ఇబ్బందులు తీర్చేలేని ప‌రిస్థితి.

దీంతో మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ఇండ‌స్ట్రీ పెద్ద‌లు షూటింగ్స్‌కి అనుమ‌తివ్వాల‌ని కోరుతూ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు శుక్ర‌వారం విజ్ఞ‌ప్తి చేశారు.  తాజాగా శ‌నివారం ఉద‌యం కేంద్ర హోంశాక స‌హాయ మంత్రి జి.కిష‌న్‌రెడ్డితో ఫేస్‌బుక్ లైవ్‌లో ఇండ‌స్ట్రీ ప్రొడ్యూస‌ర్స్ ప్ర‌త్యేకంగా ఇంట‌రాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా డి.సురేష్‌బాబు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు చ‌ర్చించారు. `ఓటీటీల్లో సెక్స్, న్యూడిటీ అస‌భ్యంగా వెబ్ సిరీస్‌లు నిర్మాస్తూ వాటినే అంద‌రికి సెన్సార్ లేకుండా చూపిస్తున్నార‌ని, వీటినే జ‌నాలు ఎక్కువ‌గా చూస్తున్నార‌ని, సినిమాల్లో మాత్రం ముద్దు సీన్ పెట్టినా సెన్సార్ వారు క‌ట్ చెబుతున్నార‌ని, ఓటీటీల‌పై నియంత్ర‌ణ వుండేలా చూడాలిన వెల్ల‌డించారు.

ఇక జీఎస్టీ అనేది బాలీవుడ్‌కు, టాలీవుడ్‌కు ఒకేలా వ‌సూలు చేస్తున్నార‌ని, ప్రాంతీయ జీఎస్టీ రావాల‌ని, ఈ విష‌యాన్ని ఆలోచించాల‌ని కోరారు. ఇక మైత్రీ మూవీమేక‌ర్స్ లో ఓ నిర్మాత అయిన ర‌విశంక‌ర్ కొత్త ప్ర‌తిపాద‌న తీసుకొచ్చారు. అన్ని వ్యాపారాల‌కు ప్ర‌భుత్వాలు లోన్‌లు ఇచ్చి ప్రోత్స‌హించిన‌ట్టుగా సినీ రంగానికి కూడా 4 లేదా 6 ప‌ర్సెంట్ వడ్డీకి లోన్‌లు అందించాల‌ని కొత్త ప్ర‌తిపాద‌న‌ను తీసుకొచ్చారు. అంద‌రి మాట‌లు విన్న కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి ఇలాంటి స‌మస్య‌లు కేవ‌లం టాలీవుడ్‌కు మాత్ర‌మే లేవ‌ని, దేశ వ్యాప్తంగా ఇలాంటి ప్ర‌తి పాద‌న‌లు వ‌చ్చాయిని, త్వ‌ర‌లోనే ఓటీటీల‌పై క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. కిష‌న్‌రెడ్డితో ఫేస్‌బుక్ లైవ్ చ‌ర్చ‌లో పాల్గొన్న వారు జెమిని కిర‌ణ్‌, అనిల్ సుంక‌ర‌, అభిశేక్ అగ‌ర్వాల్‌, త్రిపుర‌నేని వ‌ర‌ప్ర‌సాద్‌, శ‌ర‌త్‌మ‌రార్‌, బాపినీడు, సి.క‌ల్యాణ్ త‌దిత‌రులు వున్నారు.