గ్యాంగ్ లీడర్ లో అసలైన ట్విస్ట్ ఇదే


Unknown twist in nanis Gang Leader
Unknown twist in nani’s Gang Leader

న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం గ్యాంగ్ లీడర్ మరో రెండు రోజుల్లో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషనల్ టూర్ ను పూర్తి చేసుకుంది. నిన్ననే ప్రీ రిలీజ్ వేడుక కూడా జరిగింది. టీజర్, ట్రైలర్, పాటలతో చిత్రంపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నాని సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక నాని ఇందులో పెన్సిల్ పార్థసారథి పాత్రలో కనిపించనున్నాడని మనకు ఇప్పటికే తెలుసు. అయితే ఎవరికీ తెలియని మరో విషయం. నాని ఇందులో మరో మిస్టరీ పాత్ర పోషించాడట.

దానికి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ కథను కీలక మలుపు తిప్పే పాత్ర అని తెలుస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.