నటికి లైంగిక వేధింపులు


unnikrishnan sexual harassment on malayalam actress nishaమలయాళ బుల్లితెర నటి నిషా సారంగ్ దర్శకులు ఉన్ని కృష్ణన్ పై సంచలన ఆరోపణలు చేసింది . నాకు బూతు మెసేజ్ లు పంపించడమే కాకుండా సెట్ లో తాకారని చోట తాకుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని , లైంగిక వాంఛ తీర్చమని పోరు పెడుతున్నాడని అందుకు నేను నిరాకరించడంతో నాకు అవకాశాలు రాకుండా చేస్తున్నాడని అంటోంది నిషా సారంగ్ .

మలయాళంలో పలు సీరియల్ లలో నటిస్తున్న నిషా సారంగ్ దర్శకులు ఉన్ని కృష్ణన్ వేధింపులు భరించలేక అసోసియేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది . నిషా సారంగ్ పోరాట పంథా ఎంచుకోవడంతో ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నారు , తాజాగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా నిషా సారంగ్ కు మద్దతు ప్రకటించాడు .

బుల్లితెర దర్శకుడు ఉన్ని కృష్ణన్ కు సరైన శిక్ష పడేంత వరకు నా పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేసింది నిషా సారంగ్ . ఇప్పటికే మలయాళ చిత్రరంగంలో దిలీప్ – భావన ల ఉదంతం ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే . భావన ని ఇబ్బందికి గురిచేసిన సంఘటనలో హీరో దిలీప్ మూడు నెలల శిక్ష ని అనుభవించాడు కూడా . అలాగే కాస్టింగ్ కౌచ్ వివాదం చిత్రపరిశ్రమ ని పట్టి పీడిస్తున్న సమయంలో నిషా సారంగ్ అంశం మళ్ళీ ఆజ్యం పోస్తోంది .

English Title: director unnikrishnan sexual harassment on malayalam actress nisha