బేబ‌మ్మ చిన్న‌ప్పుడే అద‌ర‌గొట్టేసింది!

బేబ‌మ్మ చిన్న‌ప్పుడే అద‌ర‌గొట్టేసింది!
బేబ‌మ్మ చిన్న‌ప్పుడే అద‌ర‌గొట్టేసింది!

క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరులో పుట్టి ముంబైలో పెరిగింది కృతిశెట్టి. `ఉప్పెన‌` చిత్రంలో తొలి ప్ర‌య‌త్నంలోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకుని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షించింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏ నోట విన్నా ఒక‌టే మాట కృతిశెట్టి. చాలా మంది హీరోలు కూడా కృతిశెట్టి నామం జ‌పిస్తున్నారు. ఇప్ప‌టికే నానితో క‌లిసి రెండు చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది.

అందులో ఒక‌ట `శ్యామ్ సింఘ‌రాయ్‌` కాగా మ‌రోటి కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ డైరెక్ష‌న్‌లో నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న చిత్రం. ఇదిలా వుంటే కృతిశెట్టి చిన్న‌త‌నంలోనే కెమెరా ముందు మెరిసింద‌ని తెలిసిందే. తాజాగా ఆమె న‌టించిన క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ లైమ్‌లైట్‌లోకి వ‌చ్చేశాయి. స్కూల్‌కి వెళ్లే వ‌య‌సులోనే లైఫ్ బాయ్‌, డైరీ మిల్క్ యాడ్‌తో పాటు పెన్నులకి సంబంధించిన యాడ్‌లోనూ మెరిసింది కృతి.

ఇక 2019లో హృతిక్ రోష‌న్ న‌టించిన `సూప‌ర్ 30` చిత్రంలోని ఓ స‌న్నివేశంలోనూ క‌నిపించి స‌ర్‌ప్రైజ్ చేసింది. ప్ర‌స్తుతం ఈ యాడ్ ఫిల్స్స్‌కి సంబంధించిన వీడియోస్ నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. సినిమాల్లోకి రాకుండానే యాడ్ ఫిల్మ్స్‌లో మురిసిన బేబ‌మ్మ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మార‌డం విశేషం.