ఉపాస‌న యువ‌ర్ లైఫ్ కోసం ర‌ష్మిక‌ని దించేసింది!


ఉపాస‌న యువ‌ర్ లైఫ్ కోసం ర‌ష్మిక‌ని దించేసింది!
ఉపాస‌న యువ‌ర్ లైఫ్ కోసం ర‌ష్మిక‌ని దించేసింది!

స్టార్ హీరో రామ్‌చ‌ర‌ణ్ వైఫ్ ఉపాస‌న కొణిదెల త‌న వంతు బాధ్య‌త‌ల‌గా ప‌లు సామా.ఇక కార్య‌క్రమాల్ని నిర్వ‌హిస్తోంది. కోవిడ్ స‌మ‌యంలో ప్ర‌జ‌ల్లో హెల్దీ ఫుడ్ ప‌ట్ల అవ‌గాహ‌న పెంచేందుకు `యువ‌ర్ లైఫ్ పేరుతో వెబ్ పోర్ట‌ల్‌ని, ఓ సోష‌ల్ మీడియాని ప్రారంభించింది. ముందుగా దీనికి గెస్ట్ ఎడిట‌ర్‌గా స్టార్ హీరోయిన్ స‌మంత‌ని నియ‌మించింది.

వీరిద్ద‌రూ క‌లిసి ఇటీవ‌ల హెల్దీ ఫుడ్ విష‌యంలో ఆవ‌గాహ‌న పెంచేందుకు ప‌లు కార్య‌క్ర‌మాల‌తో పాటు హెల్త్ టిప్స్‌ని, ఆరోగ్య క‌ర‌మైన వంట‌ల్ని కంప్లీట్ హెల్త్‌కి సంబంధించిన విష‌యాల్ని వీడియోల రూపంలో పంచుకున్న విష‌యం తెలిసిందే. ఫిట్ నెస్ కి సంబంధించిన వ‌ర్క‌వుట్‌ల‌తో పాటు క్యారెట్ ఇడ్లీని చేసి స‌ద‌రు వీడియోని నెటిజ‌న్స్‌తో పంచుకుంది.

తాజాగా స‌మంత స్థానంలో క్రేజీ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌ని గెస్ట్ ఎడిట‌ర్‌ని ఉపాస‌న సెలెక్ట్ చేసింది. మంగ‌ళ‌వారం ఆమెకు సాద‌రంగా త‌మ యువ‌ర్ లైఫ్ పోర్ట‌ల్‌లోకి స్వాగ‌తం ప‌లికింది. స‌మంత త‌ర‌హాలోనే ర‌ష్మిక కూడా ఆరోగ్య ప‌ర‌మైన టిప్స్ చెబుతూనే హెల్దీ ఫుడ్‌ని ప‌రిచ‌యం చేస‌బోతోంద‌ట‌.