క్వారెంటైన్‌లో మెగా క‌పుల్‌!


క్వారెంటైన్‌లో మెగా క‌పుల్‌!
క్వారెంటైన్‌లో మెగా క‌పుల్‌!

మెగా క‌పుల్ రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న క్వారెంటైన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మంగ‌ళ‌వారం రామ్‌చ‌ర‌ణ్ త‌న‌కు క‌రోనా సోకింద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. `నేను క‌రోనా బారిన ప‌డ్డాను. తాజాగా చేసిన టెస్టుల్లో క‌రోనా పాజిటివ్ అని తేలింది. అయితే క‌రోనాకు  సంబంధించిన ల‌క్ష‌ణాలు ఏమీ లేవు. ప్ర‌స్తుతం హోమ్ క్వారెంటైన్‌లో వున్నాను. గ‌త రెండు రోజుల‌గా న‌న్ను క‌లిసిన వాళ్లు, నాతో స‌న్నిహితంగా వున్న వాళ్లు కోవిడ్ ప‌రీక్ష చేయించుకోగ‌ల‌రు. నా రిక‌వ‌రీకి సంబంధించిన వివ‌రాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు వెల్ల‌డిస్తాను` అని రామ్ చ‌ర‌ణ్ మంగ‌ళ‌వారం వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న స‌తీమ‌ణి ఉపాస‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసిన పోస్ట్ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. రామ్‌చ‌ర‌ణ్ కు కోవిడ్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డిన నేప‌థ్యంలో ఇమ్మిడియ‌ట్‌గా ఎఫెక్ట్ అయ్యే వ్య‌క్తి ఉపాస‌న‌. ఇదే విష‌యాన్ని ఉపాస‌న నెటిజ‌న్‌ల‌తో పంచుకున్నారు. త‌న‌కు ఎలాంటి కోవిడ్ ల‌క్ష‌ణాలు లేవ‌ని తెలిపిన ఉపాస‌న పాజిటివ్ రిపోర్ట్ వ‌చ్చే అవ‌కాశాలు వున్నాయని వెల్ల‌డించి షాకిచ్చింది.

ప్ర‌స్తుత ప‌రిస్థితి నుంచి పాస్ అవుతామ‌ని, 2021 బాగుంటుంద‌ని ఆశిద్దాం అన్నారు. మిస్ట‌ర్ సికి ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవు. చాలా బ‌లంగా వున్నారు. నాకు నిర్వ‌హించిన టెస్టుల్లో నెగెటివ్ వ‌చ్చింది. అయితే అది పాజిటివ్‌గా మారే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతానికి మిస్ట‌ర్ సితో క‌లిసి హోమ్ క్వారెంటైన్‌లో వున్నాను. వేడి ద్ర‌వాలు తాగుతూ, ఆవిరి ప‌డుతూ విశ్రాంతి తీసుకుంటున్నాం` అని ఉపాస‌న రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి వున్న ఓ ఫొటోని షేర్ చేశారు.