సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా అదేనా?


సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా అదేనా?
సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా అదేనా?

దర్శకుడిగా సురేందర్ రెడ్డి ప్రయాణం ఒడిదుడుకుల మధ్య సాగింది. ఒక హిట్ వస్తే వెంటనే ఒక ప్లాప్, ఒక బ్లాక్ బస్టర్ వస్తే వెంటనే ఒక డిజాస్టర్ ఇలా సాగడంతో సురేందర్ రెడ్డి టాప్ దర్శకుడు కాలేకపోయాడు. కానీ సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా సురేందర్ తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. నిజానికి సైరా ప్రాజెక్ట్ సురేందర్ చేతుల్లో పెట్టినప్పుడు ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు.

పైగా ఇంత భారీ బడ్జెట్ చిత్రాన్ని అతను ఎలా హ్యాండిల్ చేస్తాడోనన్న సందేహాలున్నాయి. అయితే ఒక్కసారి సైరా విడుదలయ్యాక అవన్నీ పటాపంచలయ్యాయి. సైరాను సూరి డీల్ చేసిన విధానానికి అందరూ ఫిదా అయిపోయారు. సినిమా పెట్టుబడి వెనక్కి తిరిగి రాబడుతుందా లేదా అన్న విషయాన్ని పక్కకు పెడితే దర్శకుడిగా సురేందర్ రెడ్డి విజయం సాధించాడు.

ఇక ఇప్పుడు ఫోకస్ అంతా సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమాపైనే ఉంది. తాజా సమాచారం ప్రకారం సురేందర్ రెడ్డి తన తర్వాతి సినిమాను ప్రభాస్ తో ప్లాన్ చేస్తున్నాడు. ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్ తో త్వరలోనే ప్రభాస్ ను కలవనున్నాడట. ప్రభాస్ ప్రస్తుతం జాన్ సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమా తర్వాతి మరొకటి ఇంకా కమిట్ అవ్వలేదు.