మార్చ్ లో ఆర్ ఆర్ ఆర్ అప్డేట్.. ఏంటి కథ?


 

Updates from RRR in march
Updates from RRR in march

ఎస్ ఎస్ రాజమౌళి అంటే ఒక బ్రాండ్ కంటే ఎక్కువ. తనతో సినిమా చేయాలని ఎంతో మంది నటీనటులు కోరుకుంటున్నారు. హీరోగానే కాదు కనీసం ఏదొక రోల్ వచ్చినా ఆనందమే అనుకునే స్టార్ హీరోలున్నారు. బాహుబలి చిత్రంతో ప్యాన్ ఇండియా మూవీని చేసినప్పుడు ఆ క్రేజ్ చూసి అటువంటి సినిమా మళ్ళీ రాదనుకున్నారు. బాహుబలి క్రేజ్ ను రిపీట్ చేయడం మళ్ళీ కుదరని పని అని అందరూ భావించారు. అయితే ఆ ఫీట్ చాలా సులభంగా చేధిస్తున్నాడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ తో బాహుబలితో సమంగా కాదు దాన్ని మించిన బజ్ తో క్రేజ్ తో సినిమాను విడుదల చేయబోతున్నాడు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ గురించి రకరకాల బిజినెస్ అప్డేట్స్ వస్తున్నాయి. అన్ని ఏరియాల నుండి బాహుబలికి మించిన రేంజ్ లో ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ మొత్తం క్లోజ్ అయిపోయినట్లు సమాచారం. సినిమా రిలీజ్ కు ఇంకా దాదాపు ఏడాది సమయముండగానే ఇలా బిజినెస్ ను క్లోజ్ చేసిన సినిమా మరొకటి లేదనడంలో అతిశయోక్తి లేదు.

అయితే క్రేజ్, బజ్ సంగతి బానే ఉంది కానీ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలై చాలా కాలమే అయినా కానీ ఇంకా దానికి సంబంధించి ఏ అప్డేట్ కూడా లేదు. కనీసం టైటిల్ ను కూడా ప్రకటించలేదు. ఆర్ ఆర్ ఆర్ అనే అంటున్నారు. పండగకో, పబ్బానికో శుభాకాంక్షలు తెలపడం తప్పితే అందుకు మించిన అప్డేట్ అనేదే లేదు. దీనిపై చాలా రకాలుగా అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేసారు. సోషల్ మీడియాలో ఈ చిత్ర అధికారిక పేజ్ ను ట్యాగ్ చేసి ఇక అప్డేట్స్ ఎప్పుడు ఇస్తావని ప్రశ్నించారు.

తాజాగా దీనికి సమాధానం దొరికింది. మార్చ్ లో ఈ చిత్ర అప్డేట్స్ ఉంటాయని తెలుస్తోంది. మరి మార్చ్ లో ఉండే అప్డేట్స్ ఏంటి అన్నదే తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ పుట్టినరోజుకు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారా లేక ఫస్ట్ లుక్, టైటిల్ వంటి అప్డేట్స్ ఏమైనా ఇస్తారా అన్నది తెలియాలి.