`గ‌ని` సెట్లో క‌న్న‌డ స్టార్ హంగామా షురూ!

`గ‌ని` సెట్లో క‌న్న‌డ స్టార్ హంగామా షురూ!
`గ‌ని` సెట్లో క‌న్న‌డ స్టార్ హంగామా షురూ!

వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `గ‌ని`. బాక్సింగ్ నేప‌థ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ ద్వారా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో అల్లు వెంక‌ట్ (బాబీ), సిద్దు ముద్ద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్ గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతోంది.

వైజాగ్‌లో తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసిన చిత్ర బృందం రెండ‌వ షెడ్యూల్‌ని ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ప్రారంభించారు. ఈ చిత్రంలో క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. గురువారం ఈ మూవీ సెట్‌లోకి క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర ఎంట్రీ ఇచ్చారు. ఆయ‌న‌కు చిత్ర బృందం సాద‌రంగా స్వాగ‌తం ప‌లికి సెట్‌లోకి ఆహ్వానించారు.

ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. విభిన్న‌మైన నేప‌థ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీతో పాటు వ‌రుణ్‌తేజ్‌ ప్ర‌స్తుతం వెంక‌టేష్‌తో క‌లిసి `ఎఫ్ 3` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.