`ఉప్పెన`‌పై మ‌హేష్ ప్ర‌శంస‌ల వ‌ర్షం!

`ఉప్పెన`‌పై మ‌హేష్ ప్ర‌శంస‌ల వ‌ర్షం!
`ఉప్పెన`‌పై మ‌హేష్ ప్ర‌శంస‌ల వ‌ర్షం!

వైష్ణ‌వ్‌తేజ్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ బుచ్చిబాబు సానా తెర‌కెక్కించిన చిత్రం `ఉప్పెన‌`. క‌న్న‌డ భామ కృతిశెట్టి హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. స‌రికొత్త ప్రేమ కావ్యంగా రూపొందిన ఈ చిత్రంపై స‌ర్వ‌త్రా ప్ర‌శంసం వ‌ర్షం కురుస్తోంది.

సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా ఈ చిత్రాన్ని ప్ర‌శంసిస్తూ అభినందిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ చేరారు. తాజాగా ఈ చిత్రంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా వీక్షించిన మ‌హేష్‌బాబు చిత్ర బృందాన్న‌పి పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు. `ఉప్పెన‌` ఓ క్లాసిక్ అని ఒక్క మాట‌లో వ‌ర్ణించారు.

`బుచ్చిబాబు… మీరు ఇండ‌స్ట్రీలో ఓ అరుదైన సినిమా చేశారు. మిమ్మ‌ల్ని చూస్తుంటే గ‌ర్వంగా వుంది. ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం హృద‌యం లాంటిది. అంత అద్భుత‌మైన సంగీతం అందించారు. తొలి చిత్రంతోనే అంద‌రినీ క‌ట్టిప‌డేసిన వైష్ణ‌వ్‌తేజ్‌, కృతిశెట్టీని అభినందించ‌కుండా వుండ‌లేక‌పోతున్నా. ఒక్క సినిమాతోనే వాళ్లు స్టార్లుగా మారిపోయారు. ఇలాంటి చిత్రానికి వెన్ను ద‌న్నుగా నిలిచిన సుకుమార్‌, మైత్రీ మూవీమేక‌ర్స్‌కు హ్యాట్సాఫ్‌` అని మ‌హేష్ ట్వీట్ చేశారు.