ఉప్పెన జల జల జలపాతం నువ్వు: డిఎస్పీ నుండి మరో మంచి మెలోడీ

 

Uppena jala jala jalapatham nuvvu melody impresses 
Uppena jala jala jalapatham nuvvu melody impresses

దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం ఫామ్ కోల్పోయాడు అంటూ ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు. అయితే దేవి శ్రీ ప్రసాద్ బౌన్స్ బ్యాక్ చిత్రం ఇదేనా అన్నట్లుగా ఉంటున్నాయి ఉప్పెన సాంగ్స్. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు అన్నీ సూపర్ డూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. ఫిబ్రవరి 12న ఉప్పెన చిత్రం విడుదలవుతోంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా లేటెస్ట్ గా జల జల జలపాతం నువ్వు అనే సాంగ్ ను రిలీజ్ చేసారు. ఈ సాంగ్ కు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్లు తమ ప్రేమ ఎంత ఎక్కువ అనేది పాట రూపంలో చెప్పుకొచ్చారు. మెలోడీ విన్న వెంటనే ఆకట్టుకునేలా ఉంది. శ్రీమణి అందించిన సాహిత్యం ప్లస్ మార్కులు వేయించుకుంటుంది.

అలాగే జస్ప్రీత్, శ్రేయ గోశల్ పాడిన విధానం మనల్ని మరింతగా ఈ పాతవైపు ఆకర్షితులు అయ్యేలా చేస్తుంది. బుచ్చి బాబు సనా ఈ సినిమాకు దర్శకుడు కాగా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.