బాలయ్య ఫ్యామిలీ కోసం ఉప్పెన స్పెషల్ స్క్రీనింగ్

uppena special screening for balayya and his family
uppena special screening for balayya and his family

గత వారం విడుదలైన ఉప్పెన సంచలనాలను నమోదు చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమా ఎవరూ ఊహించనట్లుగా 70 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి 100 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. ఒక డెబ్యూ హీరోకి ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అసాధారణం అనే చెప్పాలి. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఈ చిత్రం ద్వారా హీరో, హీరోయిన్లుగా పరిచయమైన విషయం తెల్సిందే.

అలాగే విజయ్ సేతుపతి క్యారెక్టర్ కు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఉప్పెన చిత్రాన్ని కొత్త దర్శకుడు, సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సనా తెరకెక్కించాడు. ఇక అసలు విషయంలోకి వెళితే నందమూరి బాలకృష్ణ, కుటుంబానికి ఈ చిత్ర స్పెషల్ ప్రీమియర్ నిన్న రాత్రి వేశారు.

బాలయ్య ఈ సినిమా చూసి దర్శకుడ్ని, ఉప్పెన టీమ్ ను మెచ్చుకున్నారు. బాలయ్య వంటి హీరో నుండి ప్రశంసలు రావడంతో ఉప్పెన టీమ్ సంతోషంగా ఉన్నారు. ఈ వారాంతం కూడా ఉప్పెన హంగామానే బాక్స్ ఆఫీస్ వద్ద ఉంది.