`ఉప్పెన‌` ట్రైల‌ర్‌పై ట్రోలింగ్ మొద‌లైంది!

`ఉప్పెన‌` ట్రైల‌ర్‌పై ట్రోలింగ్ మొద‌లైంది!
`ఉప్పెన‌` ట్రైల‌ర్‌పై ట్రోలింగ్ మొద‌లైంది!

వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా న‌టించిన ప్రేమ‌క‌థా చిత్రం `ఉప్పెన‌`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. క‌న్న‌డ సోయ‌గం కృతిశెట్టి హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ఎంట్రీ ఇస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌తో క‌లిసి సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో విజ‌య్ సేత‌ప‌తి రాయ‌నం పాత్ర‌లో విల‌న్‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ నెల 12న విడుద‌ల కానున్న ఈ చిత్ర ట్రైల‌ర్‌ని హీరో ఎన్టీఆర్ గురువారం విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. ప్రేమించిన త‌న కూతురిని ప్రేమ‌ని మ‌రిచిపోమ‌ని చెప్పే విల‌న్ పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి అద‌రిగొట్టేశాడు. కానీ ఆయ‌న డ‌బ్బింగ్‌పై ట్రోలింగ్ మొద‌లైంది. సైరా న‌ర‌సింహారెడ్డి, మాస్ట‌ర్ చిత్రాల్లో విజ‌య్ సేతుప‌తి న‌ట‌న టెర్రిఫిక్‌.

అయితే ఎప్పెన‌లో మాత్రం విజ‌య్ సేత‌ప‌తి వాయిస్ వినిపించ‌డం లేదు. మ‌రో వ్య‌క్తితో డ‌బ్బింగ్ చెప్పించారు. ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్న విజ‌య్ సేతుప‌తికి ఆ వాయిస్ పెద్ద‌గా సూట‌వ్వ‌లేదు. దీంతో నెటిజ‌న్స్‌, విజ‌య్ సేతుప‌తి ఫ్యాన్స్ `ఉప్పెన‌` టీమ్‌ని ట్రోల్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.