
బాలీవుడ్లో ప్రేమాయణాలు, డేటింగ్లు, లింకప్ రూమర్స్ కొత్త కాదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక జంట ప్రేమలో పడటం, డేటింగ్‌కి వెళ్లడం… పబ్బులు, పార్టీలు అంటూ చెట్టపట్టాలేసుకుని తిరగడం బాలీవుడ్ జనాలకి, సినీ సెలబ్రిటీలకి కామన్. తాజాగా అలాంటి వార్తే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సింగ్సాబ్ ద గ్రేట్, సనమ్‌రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4 చిత్రాలతో బాలీవుడ్లో హాట్ లేడీగా పేరు తెచ్చుకుంది ఊర్వశీ రౌతేలా. నిత్యం తన ఫొటో షూట్లతో సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తున్న ఊర్వశి తాజాగా మళ్లీ వార్తలకెక్కింది.
గతంలో యంగ్ క్రికెటర్ హార్థిక్ పాండ్యతో డేటింగ్లో వుందని, ఇద్దరు కలిసి పార్టీలకు, పబ్బులకు తిరుగుతున్నారని ప్రచారం జరిగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని, తాను పాండ్యాతో డేటింగ్ చేయడం లేదని, ఈ విషయాన్ని మీడియా, పబ్లిక్ ఇంతటితో వదిలేయాని, తన కుటుంబం ఈ వార్తల వల్ల ఇబ్బందిపడుతోందని స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే తాజాగా ఊర్వశిపై మరో వార్త ప్రచారంలో వుంది. ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్‌తో ఊర్వశీ రౌతేలా డేటింగ్ చేస్తోందని, ఇద్దురూ ఇటీవల ఓ హోటల్లో కలుసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ముంబై జుహూలోని ఓ ప్రైవేట్ ప్లేస్‌లో అర్థ రాత్రి ఈ జంట ప్రత్యేకంగా మీట్ అయ్యారని, టి20 ఫైనల్‌కి ముందు రోజు ఇద్దరు కలిసి డేట్‌కి, డిన్నర్‌కి వెళ్లారని ముంబై మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.అయితే దీనిపై యువ క్రికెటర్ రిషబ్ పంత్ స్పందించారు. ఊర్వశీ రౌతేలాలో క్యాజువల్‌గా కలిసానని, ఓ అభిమానిలా తను నన్ను కలిసిందని, అంతకు మించి మా మధ్య ఎలాంటి అనుబంధం లేదని స్పష్టం చేశాడు. రిషబ్ పంత్ ఇప్పటికే ఇషా నేగితో ప్రేమలో వున్న విషయం తెలిసిందే.