ప్ర‌భాస్ `ఆదిపురుష్‌`పై కొత్త రూమ‌ర్‌!

ప్ర‌భాస్ `ఆదిపురుష్‌`పై కొత్త రూమ‌ర్‌!
ప్ర‌భాస్ `ఆదిపురుష్‌`పై కొత్త రూమ‌ర్‌!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. `ఆది పురుష్‌` పేరుతో ఆత్యంత భారీ బ‌డ్జెట్‌తో టీ సిరీస్ నిర్మించ‌నున్న ఈ మూవీ ప్ర‌స్తుతం బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాదిలోనూ హాట్ టాపిక్‌గా మారింది. రామ‌య‌ణ గాధ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని 3డీ ఫార్మాట్‌లో రూపొందించ‌నున్న విష‌యం తెలిసిందే.

ఇందులో రావ‌ణాసుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ న‌టించ‌నున్నారు. ఇటీవ‌లే చిత్ర బృందం ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. హీరోయిన్‌గా ప్ర‌భాస్‌కు జోడీగా సీత పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌న్న‌ది గ‌త కొన్ని రోజులుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ విష‌యంలో కీర్తి సురేష్‌, కియారా అద్వానీల పేర్లు తెర‌పైకొచ్చాయి. అయితే తాజాగా మ‌రో భామ పేరు వినిపించ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఆమె మ‌రెవ‌రో కాదు ఊర్వ‌శీ రౌతేలా. బాలీవుడ్‌లో హాట్ హాట్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది ఏర్వ‌శీ రౌతేలా.

ఆమె పేరుని తాజాగా వార్త‌ల్లో చ‌క్క‌ర్లు కొట్ట‌డంతో చాలా మంది కియారానే సీత పాత్ర‌లో అంగీక‌రించ‌డం క‌ష్టం అంటే హాట్ బ్యూటీ ఊర్వ‌శీ రౌతేలా సీత ఏంట‌ని ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు.