ఊర్వ‌శీ రౌతేలా కండీష‌న్స్ పెడుతోందా?


ఊర్వ‌శీ రౌతేలా కండీష‌న్స్ పెడుతోందా?
ఊర్వ‌శీ రౌతేలా కండీష‌న్స్ పెడుతోందా?

ఊర్వ‌శీ రౌతేలా.. టీనేజ్ యూత్‌కి క‌ల‌ల‌క రాణిగా మారింది. స‌న‌మ్ రే, గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ, హేట్ స్టోరీ 4 వంటి చిత్రాల‌తో హాటెస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం `వ‌ర్జిన్ భానుప్రియ‌` చిత్రంలో న‌టిస్తోంది. కోవిడ్ కార‌ణంగా ఈ మూవీ జీ5 లో రిలీజ్ కాబోతోంది. సోష‌ల్ మీడియాలో 30 మిలియ‌న్‌ల ఫాలోవ‌ర్స్‌ని సొంతం చేసుకున్న ఊర్వ‌శీ క్రేజీకి మెచ్చిన మ‌న వాళ్లు ఈ అందాన్ని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు.

ఊర్వ‌శీ రౌతేలా తెలుగులో ప‌రిచ‌యం అవుతున్న వెబ్ సిరీస్‌ `బ్లాక్ రోజ్`. సంప‌త్‌నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ వెబ్ సిరీస్ ని కె. కె. రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే చిత్రీక‌రణ మొద‌లైంది. ప‌ది రోజుల పాటు షూటింగ్ పూర్తి చేశారు. షెడ్యూల్ పూర్తి కావ‌డంతో ఊర్వ‌శి ముంబై చెక్కేసింది. వెళితే వెళ్లింది కానీ నిర్మాత‌కు చుక్క‌లు చూపించింద‌ని తెలిసింది.

ముందు అంగీక‌రించిన పారితోషికంతో పాటు ఇప్ప‌డు ఎక్స్‌ట్రా కావాల‌ని డిమాండ్ చేస్తోంద‌ట‌. శంషాబాద్ విమానాశ్ర‌యానికి ద‌గ్గ‌ర‌గా నోవాటెల్ వుండ‌టంతో అక్క‌డే త‌న‌కు వుండేందుకు ఏర్పాట్లు చేయాల‌ని డిమాండ్ చేసింద‌ట‌. దీని కోసం భారీగానే డిమాండ్ చేసింద‌ని చెబుతున్నారు. అంతే కాకుండా త‌న‌కు డైలీ షూటింగ్‌కి రావ‌డం కోసం ల‌గ్జ‌రీ బెంజ్ కార్‌ని పంపించాల‌ని కూడా డిమాండ్ చేసిన‌ట్టు చెబుతున్నారు.