హాట్ బ్యూటీ `బ్లాక్ రోజ్‌`ఫ‌స్ట్‌లుక్!


హాట్ బ్యూటీ `బ్లాక్ రోజ్‌`ఫ‌స్ట్‌లుక్!
హాట్ బ్యూటీ `బ్లాక్ రోజ్‌`ఫ‌స్ట్‌లుక్!

బాలీవుడ్ హాట్ ఆట‌మ్ బాంబ్‌.. మాజీ మిస్ ఇండియా ఊర్వ‌శీ రౌతేలా న‌టిస్తున్న తాజా చిత్రం `బ్లాక్ రోజ్‌`. స‌న‌మ్‌రే, గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ, హేట్ స్టోరీ 4 వంటి చిత్రాల‌తో బాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపుని ఫ్యాన్ బేస్‌ని ఏర్పాటు చేసుకున్నారు ఊర్వ‌శీ రౌతేలా. ఆమె తెలుగులో న‌టిస్తున్నమొట్ట‌మొద‌టి చిత్ర‌మిది. ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది క్రియేట్ చేసిన ఈ మూవీ ద్వారా మోహ‌న్ భ‌ర‌ద్వాజ్ ద‌ర్శ‌కుడిగా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు.

శ్రీ‌నివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షేక్స్ పియ‌ర్ న‌వ‌ల `ది మ‌ర్చంట్ ఆఫ్ వినిస్‌`లోని `షైలాక్‌` అనే పాత్రని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఫిమేల్ ఓరియెంటెడ్ ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌ని తెర‌కెక్కిస్తున్నారు. `మీరు మీ డబ్బును అప్పుగా ఇస్తే డబ్బును కోల్పోతారు లేదా శత్రువును పొందవచ్చు.. `యోగ్య‌త లేని ఆర్థిక లావాదేవీలు శ‌త్రుత్వాన్ని పెంచేస్తాయి` అనే సూక్తుల నేప‌థ్యంలో ఈ మూవీని ఓ ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిస్తున్నారు.

బుధ‌వారం ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్‌ని ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది రిలీజ్ చేశారు. `ఈ బిగ్ బ్యాడ్ వ‌ర‌ల్డ్‌లో రోజెస్ వున్నాయి. బ్లాక్ రోస్ కూడా వుంది` అని ట్వీట్ చేశారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో రెడ్ సారీ.. బ్లాక్ బ్లౌస్‌లో ఊర్వ‌శీ రౌతేలా మ‌రింత హాట్‌గా క‌నిపిస్తోంది. ఆమె న‌డుచుకుంటూ వ‌స్తుండ‌గా చుట్టూ క‌రెన్సీ నోట్లు గాల్లో ఎగురుతున్న‌ట్టుగా చూపించారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ కానుంది.