వీడియో స్టోరీ: జ‌ల‌క‌న్య సొగ‌సు చూడ‌త‌ర‌మా!


వీడియో స్టోరీ: జ‌ల‌క‌న్య సొగ‌సు చూడ‌త‌ర‌మా!
వీడియో స్టోరీ: జ‌ల‌క‌న్య సొగ‌సు చూడ‌త‌ర‌మా!

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వేళ ఒక్కో సెల‌డ్రిటీ ఒక్కో ర‌కంగా చిత్ర విచిత్రంగా త‌మ ఐసోలేష‌న్‌కి సంబంధించిన ఫొటోల‌ని, వీడియోల‌ని ఇంట‌ర్నెట్‌లో వ‌దిలేస్తున్నారు. సోష‌ల్ మీడియాని త‌మ వీడియోల‌తో, ఫొటోల‌తో పిచ్చెక్కించేస్తున్నారు. ఇంకొంద‌రేమో త‌మ‌కు న‌చ్చిన ప‌నుల్లో నిమ‌గ్న‌మై ఆక‌ట్టుకుంటున్నారు.

ఈ విష‌యంలో బాలీవుడ్ హాటీ ఊర్వ‌శీ రౌతేలా ఇంకొంచెం హాట్‌గా నీటీగా బిహేవ్ చేస్తోంది. క‌రోనా దేశా వ్య‌ప్తంగా వ్యాపిస్తున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం అనూహ్యంగా లాక్ డౌన్‌కు పిలుపు నిచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో 21 రోజుల పాటు సామాన్యులు, సెల‌బ్రిటీలు ఇళ్ల‌కే ప‌రిమితం కావాల్సిన ప‌రిస్థితి. గ‌త కొంత కాలంగా బిజీ బిజీ జీవితాల్ని గ‌డిపిన వారంతా లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైపోయి రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.

అంద‌రిలాగే హాటీ ఊర్వ‌శీ రౌతేలా కూడా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఈ ఐసోలేష‌న్ పిరియేడ్‌ని ఇంటి ప‌ట్టునే వుంటూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ టైమ్ బాగానే ఆస్వాదిస్తున్న ఆమె ఏకంగా జ‌ల‌క‌న్య‌గా మారిపోయింది. ఇంటి ఆవ‌ర‌ణ‌లో వున్న స్విమ్మింగ్ ఫూల్‌లో టూ పీస్ పింక్ బికినీలో ద‌ర్శ‌న‌మిస్తూ అండ‌ర్ వాట‌ర్లో జ‌ల‌క‌న్య‌లా యోగా చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోని సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో షేర్ చేయ‌డంతో నెటిజ‌న్స్ ఊర్వ‌శీ రౌతేలా అందాల‌ని ఆస్వాదిస్తూ పండ‌గ చేసుకుంటున్నారు.

Credit: Instagram