యూఎస్ డిస్ట్రిబ్యూటర్లను భయపెడుతున్న సైరాSyeraa US Collections
Syeraa US Collections

ఒకప్పుడు యూఎస్ మార్కెట్ అంటే బంగారు బాతు గుడ్డు లెక్క. అసలు అక్కడ సినిమాలు మనతో పాటు విడుదలవుతాయా లేదా అన్న సందేహాల నుండి అక్కడ ప్రీమియర్లు వేసి ఒక్కరోజులోనే 1 మిలియన్ డాలర్లు కొల్లగొట్టే స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. యూఎస్ మార్కెట్ ఉందన్న కారణంతో హీరోలు పారితోషికం పెంచుకుంటూ పోయారు. దర్శకులు బడ్జెట్ లు పెంచుకుంటూ పోయారు.

అయితే ఏమైందో సరైన కారణం తెలీదు కానీ యూఎస్ లో తెలుగు సినిమాల హవా బాగా తగ్గిపోయింది. ఇదివరకటిలా అక్కడ సినిమాలు ఇరగబడి ఆడేయట్లేదు. స్టార్ హీరోల సినిమాలు కూడా 2 మిలియన్ దాటడం కష్టంగా మారింది. ఇటీవలే విడుదలైన సైరా అయితే కష్టపడి 2.5 మిలియన్ డాలర్స్ దగ్గరకి వచ్చింది. సినిమా సేఫ్ అవ్వాలంటే కచ్చితంగా మరో మిలియన్ సాధించాలి. ఇప్పుడున్న వసూళ్ల ప్రకారం 2.5 దాటితే గొప్పమాటే.

ఇది చూసి సంక్రాంతి బడా సినిమాల్ని కొన్న డిస్ట్రిబ్యూటర్ల గుండెల్లో గుబులు మొదలైంది. సాహో చిత్రానికి కలెక్షన్స్ రాకపోతే బ్యాడ్ టాక్ అనుకున్నారు కానీ ఇప్పుడు సాహోకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. అయినా కూడా యూఎస్ లో సాహో లాస్ వెంచర్ గా మిగలనుంది. సంక్రాంతి భారీ సినిమాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు రెండూ కలిపి అక్కడ 5 మిలియన్ దాకా బిజినెస్ చేసాయి. యూఎస్ మార్కెట్ డౌన్ లో ఉన్న నేపథ్యంలో అంత మొత్తం రాబట్టడం సాధ్యమేనా?