అమెరికా నేప‌థ్యంలో బ్లాక్ బ‌స్ట‌ర్ సీక్వెల్!

అమెరికా నేప‌థ్యంలో బ్లాక్ బ‌స్ట‌ర్ సీక్వెల్!
అమెరికా నేప‌థ్యంలో బ్లాక్ బ‌స్ట‌ర్ సీక్వెల్!

న‌వీన్ పొలిశెట్టి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన హిలేరియ‌స్ ఎంట‌ర్టైన‌ర్ `జాతిర‌త్నాలు`. రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి పులికొండ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని అనుదీప్ కె.వి. అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించాడు. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన ఈ చిత్రాన్ని స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ నిర్శించిన విష‌యం తెలిసిందే.

ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం `ఉప్పెన‌` త‌రువాత ఆ స్థాయిలో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌ర‌ల్డ్ వైడ్‌గా అనూహ్య విజ‌యాన్ని సాధించి క‌లెక్ష‌న్‌ల వ‌ర్షం కురిపించింది. హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ అమ‌లాపురం నుంచి అమెరికా దాకా భారీ వ‌సూళ్ల‌ని సాధించి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేసింది. ఊహించ‌ని స్థాయిలో వ‌సూళ్ల‌తో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్‌ని చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్ర సీక్వెల్‌ని అమెరికా నేప‌థ్యంలో తెర‌కెక్కించాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్‌ని త్వ‌ర‌లోనే చేయ‌బోతున్నార‌ట‌. న‌వీన్ పొలిశెట్టితో పాటు రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి పొలికొండ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. ఈ మూవీ ఎప్పుడు మొద‌లౌతుంది?  వంటి వివ‌రాలు త్వ‌ర‌లోనే మేక‌ర్స్ ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది