మరో బోల్డ్ ప్రాజెక్ట్ ను టేకప్ చేసిన యూవీ

మరో బోల్డ్ ప్రాజెక్ట్ ను టేకప్ చేసిన యూవీ
మరో బోల్డ్ ప్రాజెక్ట్ ను టేకప్ చేసిన యూవీ

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యాకప్ చేసిన చిత్రం ఏక్ మినీ కథ. బోల్డ్ కాన్సెప్ట్ తో, అసలు మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా అనిపించే సబ్జెక్ట్ తో రూపొందించిన ఈ చిత్రం పర్వాలేదనిపించుకుంది. ఈ సినిమాకు కథ మేర్లపాక గాంధీ అందించాడు. యూవీ క్రియేషన్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ అందించింది. డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసారు.

ఇప్పుడు యూవీ క్రియేషన్స్ మరో బోల్డ్ కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా వెబ్ ఫిలిం అని సమాచారం. మరోసారి మేర్లపాక గాంధీతోనే యూవీ క్రియేషన్స్ ముందుకెళుతోంది. స్ట్రిక్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు యూవీ క్రియేషన్స్.

మరోవైపు మేర్లపాక గాంధీ నితిన్ హీరోగా మేస్ట్రో చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన అంధధూన్ చిత్రానికి రీమేక్ ఇది. యూవీ క్రియేషన్స్ కూడా అనుష్క ప్రధాన పాత్రలో మరో సినిమాను నిర్మించడానికి రంగం సిద్ధం చేసుకుంది. ప్రభాస్ హీరోగా రాధే శ్యామ్ ను నిర్మించింది.